అక్తర్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడు!

8 Aug, 2019 13:09 IST|Sakshi

ఒంటారియో: తమ దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్‌ తనను ఫిక్సింగ్‌ చేయమన్నాడంటూ వివాదాస్పద పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌ మరో వివాదానికి తెరలేపాడు. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో భాగంగా విన్‌పిగ్‌ హాక్స్‌ తరఫున ఆడుతున్న అక్మల్‌ను ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ కీలక పాత్ర పోషిస్తున్న మన్సూర్‌ అక్తర్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడట. ఈ విషయాన్ని కెనడా లీగ్‌ యాజమన్యంతో పాటు తమ అవినీతి నిరోధక విభాగానికి అక్మల్‌ తెలియజేనట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. 

‘కొన్ని మ్యాచ్‌లు ఫిక్సింగ్‌ చేస్తావా’ అంటూ అక్తర్‌ ఆఫర్‌ చేసిన అక్మల్‌ తమ దృష్టికి తీసుకొచ్చాడని పాక్‌ క్రికెట్‌ బోర్డులోని ఒక అధికారి పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సదరు అధికారి తెలిపారు. 61 ఏళ్ల మన్సూర్‌ అక్తర్‌ 19 టెస్టులు, 41 వన్డేలు ఆడాడు. 1980 నుంచి 1990 వరకూ పాక్‌ తరఫున క్రికెట్‌ ఆడాడు. ప్రస్తుతం గ్లోబల్‌ ట20 కెనడా లీగ్‌ విన్‌పిక్‌ హాగ్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో సేవలందిస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఉమర్‌ అక్మల్‌కు చోటు దక్కలేదు. కోచ్‌ మికీ ఆర్థర్‌తో విభేదాల నేపథ్యంలో అక్మల్‌ను వరల్డ్‌కప్‌ జట్టులో ఎంపిక చేయలేదు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా జరిగిన వన్డే సిరీస్‌లో అక్మల్‌ ఆకట్టుకున్నప్పటికీ అతనికి వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కల్పించలేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పరాజయాల టైటాన్స్‌

క్వార్టర్స్‌లో సౌరభ్‌ వర్మ

ఆమ్లా అల్విదా

వాన దోబూచులాట

టీమిండియా ఫీల్డింగ్‌

'పొలార్డ్‌.. నీతో తలపడడమే నాకు ఆనందం'

మొదటి వన్డేకు వర్షం అడ్డంకి

పెళ్లిపీటలెక్కనున్న రెజ్లింగ్‌ జంట

‘బీసీసీఐ.. నన్ను మిస్సవుతున్నారు’

కింగ్స్‌ పంజాబ్‌కు హెస్సన్‌ గుడ్‌ బై

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు

శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

అన్సారీకి స్వర్ణ పతకం

శ్రీథన్‌కు కాంస్యం

కోచ్‌ మికీ ఆర్థర్‌కు పాక్‌ గుడ్‌బై

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి

భారత స్టార్స్‌కు చుక్కెదురు

మా డబ్బులిస్తేనే ఆడతాం!

బోపన్న జంట సంచలనం

సింధు సంపాదన రూ.39 కోట్లు

నిఖత్‌ జరీన్‌కు షాక్‌!

ఇక వన్డే సమరం

బలిపశువును చేశారు.. పాక్‌ కోచ్‌ ఆవేదన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...