తెలంగాణ రాష్ట్ర చెస్‌ జట్టులో ఉమేశ్, కీర్తి

13 Aug, 2019 09:53 IST|Sakshi

చెస్‌ సెలక్షన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అమెచ్యూర్‌ ఓపెన్‌ చెస్‌ సెలక్షన్‌ టోర్నమెంట్‌లో కె. ఉమేశ్, జి. కీర్తి మెరుగైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. వీరిద్దరితో పాటు అభిరామ్‌ ప్రమోద్, అంకిత గౌడ్‌ కూడా జాతీయ చెస్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ సెలక్షన్స్‌లో నిర్ణీత 8 రౌండ్ల అనంతరం బాలుర విభాగంలో ఉమేశ్‌ 7 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచాడు. అభిరామ్‌ 6.5 పాయింట్లతో రన్నరప్‌ ట్రోఫీని అందుకున్నాడు.

బాలికల కేటగిరీలో కీర్తి 6 పాయింట్లతో, అంకిత 5.5 పాయింట్లతో తొలి రెండు స్థానాలను దక్కించుకుని రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ టోర్నీలో తొలి 13 స్థానాల్లో నిలిచిన పురుషులకు, తొలి 8 స్థానాలను దక్కించుకున్న మహిళలకు రూ. 1000 ప్రైజ్‌మనీగా అందజేశారు. చివరిదైన ఎనిమిదో రౌండ్‌లో వినోద్‌ (6)పై ఉమేశ్‌ (7), ధ్రువ (6)పై అభిరామ్‌ (6.5), అంకిత (5.5)పై అద్వయ్‌ (6.5), నేత్ర (5)పై సుబ్బరాజు (6), అధ్వర శిరీష్‌ (5)పై కీర్తి (6), రోహిత్‌ (5)పై సత్యనారాయణ (6), గౌతమ్‌ (5)పై సూర్య (6), రవితేజ (5)పై సంకేత్‌రెడ్డి (6), శశాంక్‌ (5)పై విఘ్నేశ్‌ (6), జ్ఞానిత(4.5) శ్రీధన్వి (5.5), బ్రహ్మానందం (4)పై హర్షిత (5.5)పై గెలుపొందారు.  

మరిన్ని వార్తలు