ధోనికి ‘సిరీస్’ పరీక్ష

29 Oct, 2016 00:29 IST|Sakshi
ధోనికి ‘సిరీస్’ పరీక్ష

ధోనిపై తీవ్రమైన ఒత్తిడి
చివరి వన్డేకు సిద్ధమైన విశాఖ
ఇరు జట్ల లక్ష్యం సిరీస్ విజయం
భారత జట్టులో ఒక మార్పు
ఆత్మవిశ్వాసంతో కివీస్  

 

భారత కెప్టెన్‌గా ధోని సాధించిన విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరుుతే అతని నాయకత్వంలో గతంలోనూ చాలా సార్లు జట్టు ఘోరంగా విఫలమైంది. కానీ అలాంటి సందర్భాల్లోనూ ఏనాడూ అతను ఇంతటి శల్య పరీక్షను ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. కారణం... కోహ్లి అనూహ్య వేగంతో ఎదిగి పోవడం. ఒక వైపు టెస్టుల్లో అతను క్లీన్‌స్వీప్ కిరీటాన్ని తగిలించుకొని వస్తే, ఇప్పుడు ధోని వన్డే సిరీస్ గెలవడానికి శ్రమించాల్సి వస్తోంది. వెంటనే కెప్టెన్సీ పోయే ప్రమాదం లేకున్నా... ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా ఒక అద్భుతం చేస్తే గానీ ధోనిపై నమ్మకం పెరిగేలా లేదు.

 
వైజాగ్‌తో ధోని అనుబంధం ప్రత్యేకమైంది. అతనిలోని సూపర్ హీరోను ప్రపంచానికి పరిచయం చేసిన మ్యాచ్ అతను ఇక్కడే ఆడాడు. ఇప్పుడు కెరీర్ చివరి దశలో అతను మరోసారి విశాఖ వేదికగా కీలక విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. మరో వైపు కివీస్ కూడా తొలిసారి భారత గడ్డపై సిరీస్ విజయంపై దృష్టి పెట్టడంతో సాగర తీరంలో మ్యాచ్‌పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోరుుంది. మరి ఇరు జట్లలో ఎవరిది పైచేరుు కానుందో! 

 

విశాఖపట్నం: భారత్‌తో టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు ఆటతీరు చూస్తే వన్డే సిరీస్ ఫలితం కోసం చివరి దాకా వేచి ఉండాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మెరుగైన ప్రదర్శనతో కివీస్ వన్డేల్లో రాత మార్చుకుంది. అనూహ్యంగా పటిష్ట భారత్‌కు గట్టి పోటీనిస్తూ సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. గతంలో సొంతగడ్డపై ఏనాడూ కివీస్ చేతిలో సిరీస్ ఓడిపోని భారత్, ఇప్పుడు ఆ రికార్డును నిలబెట్టుకునేందుకు పోరాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో వన్డే నేడు (శనివారం) ఇక్కడి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. విజయం తోనే సిరీస్‌ను ముగించాలని ధోనిసేన పట్టుదలతో ఉండగా, గత వన్డేలో విజయం స్ఫూర్తితో మరో గెలుపు అందుకోవాలని విలియమ్సన్ బృందం భావిస్తోంది. మరి భారత క్రికెట్ అభిమానులు విజయంతో దీపావళి చేసుకోగలరా చూడాలి.

 
బుమ్రా జట్టులోకి...

రాంచీ మ్యాచ్‌లో పరాజయం భారత జట్టును కలవరపరిచింది. అంతకు ముందు మ్యాచ్‌లో చెలరేగిన ధోని సొంతగడ్డపై విఫలమయ్యాడు. ఇప్పుడు నాలుగో స్థానంలోనే కొనసాగాలని భావిస్తున్న కెప్టెన్, ఆ స్థానానికి తగినట్లుగా కీలక ఇన్నింగ్‌‌స ఆడాల్సి ఉంది. కోహ్లి తిరుగు లేని ఫామ్ జట్టు బలంతో పాటు బలహీనతగా కూడా మారింది. అతను విఫలమైతే జట్టు కుప్పకూలిపోతుందేమో అనిపిస్తోంది. సిరీస్ మొత్తం విఫలమైన రోహిత్ శర్మ చివరి మ్యాచ్‌లోనైనా ఆడితే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. రహానే గత వన్డేలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా, ఓపెనర్‌గా ఆడుతున్న అతను భారీ స్కోరు చేయాల్సి ఉంది. మనీశ్ పాండే, కేదార్ జాదవ్ నాలుగో వన్డే వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటారని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో ధావల్ కులకర్ణి స్థానంలో పూర్తి ఫిట్‌గా ఉన్న బుమ్రా రానున్నాడు. మరో పేసర్‌గా ఉమేశ్ ఉన్నా, జట్టు మరో సారి స్పిన్నర్లు అక్షర్, మిశ్రాలపై ఆధారపడుతోంది. జాదవ్ ఆఫ్‌స్పిన్ కూడా జత కలిస్తే కివీస్‌ను కట్టడి చేయవచ్చు. తొలి మ్యాచ్ బౌలింగ్ ప్రదర్శన స్థారుులో మళ్లీ బంతులు వేయలేకపోరుున పాండ్యా కూడా ఆల్‌రౌండర్‌గా మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. సిరీస్ ఫలితం ఆఖరి వన్డే దాకా వెళ్లడంతో ఇక జయంత్ యాదవ్, మన్‌దీప్ సింగ్‌లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దాదాపుగా లేనట్లే.

 
బ్యాట్స్‌మెన్‌దే భారం

తొలి టెస్టు నుంచి విఫలమవుతూ వచ్చిన గప్టిల్ గత మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా విఫలమైన టేలర్ కూడా చివరి రెండు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వడంతో కివీస్ శిబిరానికి ఊరట లభించింది. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్, లాథమ్‌లతో ఆ జట్టు బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. బ్యాటింగ్ బలం పెంచేందుకు... గత మ్యాచ్‌లో పక్కన పెట్టిన అండర్సన్‌ను కూడా మళ్లీ తీసుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌గా నీషమ్ తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. రాంచీ మ్యాచ్‌లో ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లను ఆడించిన కివీస్, ఈ సారి సోధి స్థానంలో పేసర్ హెన్రీని ఎంచుకోవచ్చు. ఇక బౌలింగ్‌లో సౌతీ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. కివీస్ గెలిచిన రెండు మ్యాచ్‌లను చక్కటి స్వింగ్‌తో మలుపు తిప్పింది సౌతీనే. ఐసీసీ నంబర్‌వన్ బౌలర్ బౌల్ట్‌నుంచి కూడా మన బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదం పొంచి ఉంది. కోహ్లిని నిరోధిస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని కివీస్ గుర్తించింది. ఈ సారి కూడా అదే తరహా వ్యూహంతో విలియమ్సన్ టీమ్ బరిలోకి దిగుతోంది. మూడు టెస్టులు, తొలి వన్డే తర్వాత భారత్‌తో పోలిస్తే ఎంతో బలహీనంగా కనిపించిన న్యూజిలాండ్ ఇప్పుడు సిరీస్ గెలుపుపై కూడా ఆశలు పెంచుకుందంటే ఆ జట్టు సమష్టి ప్రదర్శనే కారణం. ఇప్పుడు మరోసారి దానిని పునరావృతం చేయాలని జట్టు భావిస్తోంది.


జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, పాండే, జాదవ్, పాండ్యా, అక్షర్, మిశ్రా, ఉమేశ్, బుమ్రా.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, వాట్లింగ్, నీషమ్, అండర్సన్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, హెన్రీ.

 

విరాట్ కోహ్లి ఇక్కడ ఆడిన మూడు వన్డేలలో వరుసగా 118, 117, 99 పరుగులు చేయడం విశేషం. 

విశాఖపట్నంలో భారత్ 5 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 గెలిచి, 1 మ్యాచ్‌లో ఓడింది. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లపై ఒక్కోసారి నెగ్గిన జట్టు, వెస్టిం డీస్ చేతిలో ఓడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం విండీస్‌తో జరగాల్సిన వన్డే హుదూద్ కారణం గా రద్దరుుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టి20లో భారత్, శ్రీలంకను చిత్తు చేసింది.

 

వాన గండం వీడలేదు...
తుఫాన్ బలహీన పడటంతో చివరి వన్డేకు ఇక ఇబ్బంది ఉండదని అనిపించింది. అరుుతే ఏ సమయంలోనైనా వాన కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగవచ్చు. మ్యాచ్ జరిగే శనివారం రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అరుుతే అవుట్‌ఫీల్డ్‌ను మొత్తం కవర్ చేశామని, వర్షం వచ్చినా మ్యాచ్‌కు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని క్యురేటర్ నాగమల్లయ్య చెప్పారు. పిచ్‌పై ఎలాంటి పచ్చిక లేదు. బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పాటు కొంత బౌన్‌‌సకు అవకాశం ఉంది. 

 

విరాట్ గొప్ప ఆటగాడు. ప్రతీ సారి అతని పరుగులు జట్టుకు ఉపయోగపడుతున్నారుు. దాని వల్ల కోహ్లి తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అరుుతే మేం అతనిపై అతిగా ఆధారపడటం లేదు. జట్టులో మంచి బ్యాట్స్‌మెన్ చాలా మంది ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు మంచి ఆట ప్రదర్శించడం ముఖ్యం. గత మ్యాచ్ వైఫల్యంనుంచి నేను, పాండే నేర్చుకుంటాం. కెప్టెన్ బౌలింగ్ చేయమని కోరినప్పుడు పార్ట్‌టైమర్‌లా కాకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం ముఖ్యం.  -కేదార్ జాదవ్

 

మా జట్టులో అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతంలో ఏ కివీస్ జట్టుకు సాధ్యం కాని ఘనతను సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. చాలా మందికి ఇదో సుదీర్ఘ పర్యటన. దీనిని విజయంతో ముగించాలని భావిస్తున్నాం. కోహ్లితో పాటు ఇతర బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడం కూడా కీలకం. గత మ్యాచ్‌లో చివరి జోడీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అరుుతే రాంచీ ప్రదర్శనను పునరావృతం చేయగలమని విశ్వాసంతో ఉన్నాం.  - టిమ్ సౌతీ

>
మరిన్ని వార్తలు