హార్ధిక్‌కు మాజీ ప్రియురాలి విషెష్‌!

2 Jan, 2020 18:26 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి నటాషా స్టాన్‌వికోవిచ్‌లు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనున్నారు. గత కొద్ది రోజులుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట న్యూ ఇయర్‌ వేడుకల కోసం దుబాయ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వీరిద్దరూ అధికారంగా ప్రకటించారు. దీంతో పాండ్యా నిశ్చితార్థం విషయం తెలిసి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు ప్రముఖ క్రికెటర్లు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలుపుతున్నారు.

అయితే  శుభాకాంక్షలు తెలిపే సెలబ్రిటీలలో పాండ్యా ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కూడా ఉండటం విశేషం. ఉర్వశి ‘మీ జంటకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. మీ బంధం ఎప్పుడూ ప్రేమతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ పాండ్యా పోస్టుకు కామెంటు పెట్టింది. గతంలో వీరిద్దరూ ప్రేమాయణం నడిపినట్లు బి టౌన్‌లో గుసగుసలు వినిపించాయి. దీంతో వీరి ప్రేమ గురించి తెలిసిన సన్నిహితులను ఉర్వశి కామెంటు ఒకిం‍త ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

కాగా హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాలో నటాషా వేలుకు రింగ్‌ తొడుగుతున్న పోటోలకు ‘నా మెరుపుతీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. హార్దిక్‌ వెంట బోట్‌లో అతని సోదరుడు కృనాల్‌ పాండ్యా, అతని భార్య పంఖురి కూడా ఉన్నారు.  27 ఏళ్ల నటాషా 2012లో సెర్బియా నుంచి ముంబైకి వచ్చింది. కొన్ని విఖ్యాత బ్రాండ్‌లకు చెందిన వాణిజ్య ప్రకటనల్లోను నటించింది. 2013లో ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో ‘సత్యాగ్రహ’ సినిమాలో నటించింది.

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా