సెరెనాకు షాక్

9 Sep, 2016 09:16 IST|Sakshi
సెరెనాకు షాక్

న్యూయార్క్: అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కు షాక్ తగిలింది. 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలన్న ఆమె ఆశలపై చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా నీళ్లు చల్లింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సెమీఫైనల్లో సెరెనా ఓడించి ఫైనల్ కు చేరింది. వరుసగా 187 వారాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా.. 10 సీడ్ ప్లిస్కోవా చేతిలో 2-6, 7-6(7/5) తేడాతో పరాజయం పాలైంది.

1993 తర్వాత యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ప్రవేశించడం ఇదే మొదటిసారి. కెబర్ తో ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా తలపడనుంది.

సెరెనాకు ఓడించడం నమ్మలేకపోతున్నానని సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లిస్కోవా వ్యాఖ్యానించింది. ‘నేను బాగా ఆడితే ఎవరినైనా ఓడిస్తానని నాకు తెలుసు. ఈరోజు బాగా ఆడాను. ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెరెనా లాంటి గొప్ప క్రీడాకారిణిని ఓడించడం చాలా సంతోషంగా ఉంద’ని ప్లిస్కోవా పేర్కొంది. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

మరిన్ని వార్తలు