జీరో గ్రావిటీలోనూ అదరగొట్టిన బోల్ట్‌

13 Sep, 2018 16:38 IST|Sakshi

పారిస్‌: జమైకా చిరుత.. స్టార్‌ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ పరుగులు తీయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. కానీ ఈ సారి నేల మీద కాదు.. జీరో గ్రావిటీ వాతావరణంలో పరుగులు తీశాడు. తనతోపాటు పోటీలో పాల్గొన్న ఫ్రెంచ్ వ్యోమగామి జీన్‌ ఫ్రాంకోయిస్‌, నోవెస్పేస్‌ సీఈవో ఆక్టేవ్‌ డి గల్లె వారితో కలిసి పరుగులు తీశాడు. ఈ పందెంలో తొలుత తడబడిన బోల్ట్‌ చివర్లో మాత్రం విజేతగా నిలిచాడు. జీరో స్పేస్‌ సాంకేతికత తెలిసిన వారిపై అదే వాతావరణంలో సరదాగా జరిగిన రేస్‌లో గెలిచి తన సత్తా చాటాడు.

అయితే ఇదంత జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా.. జీరో గ్రావిటీతో ప్రత్యేకంగా తయారైన ఎయిర్‌బస్‌ జీరో జీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బోల్ట్‌ తన స్టైల్లో షాంపైన్‌ బాటిల్‌తో తన విజయాన్ని సెలబ్రెట్‌ చేసుకున్నాడు. అయితే ఈ బాటిల్‌ను  స్పేస్‌ టూరిజం పెంపొందించడానికి, వ్యోమగాముల కోసం ప్రత్యేంగా తయారు చేశారు. దీనిపై బోల్ట్‌ మాట్లాడుతూ.. తొలుత కొద్దిగా నీరసంగా ఫీల్‌ అయినప్పటికీ..  తర్వాత ఈ అనుభూతి చాలా బాగా అనిపించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బోల్ట్‌.. 2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్‌షిప్‌ అనంతరం అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు.

మరిన్ని వార్తలు