'ఇప్పటికీ నేనే గ్రేటెస్ట్'

6 Aug, 2017 16:27 IST|Sakshi
'ఇప్పటికీ నేనే గ్రేటెస్ట్'

లండన్: వరల్డ్ అథ్లెటిక్స్‌ చాంపియన్ పోటీల్లో 100 మీటర్ల రేసులో బరిలోకి దిగి కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం తన ఆధిపత్యాన్నిఎంతమాత్రం తగ్గించదని జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అభిప్రాయపడ్దాడు. ఇప్పటికీ తానే గ్రేటెస్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ' ప్రపంచ గ్రేటెస్ట్ అథ్లెట్లలో నేను ఒక్కడ్ని అని ఎప్పుడో నిరూపించుకున్నా. లండన్ వ్యక్తిగత పరుగులో కాంస్య పతకంతో సరిపెట్టుకోవడం నా ఆధిపత్యాన్ని ఏమీ తగ్గించదు. నా అత్యుత్తమ పదర్శనిని ఇచ్చా. కాంస్య పతకం నన్ను నిరూత్సాహానికి గురి చేయడం లేదు. కాకపోతే నాపై కాస్త ఒత్తిడి పడింది. సరైన ఆరంభాన్ని ఇవ్వకపోతే వెనుకబడిపోతాను అనే విషయంపై ఒత్తిడికి లోనయ్యా. అదే నన్ను రేస్ లో వెనుకబడటానికి కారణం కూడా కావొచ్చు. అయితే కొద్ది తేడాలో మాత్రం ప్రథమ స్థానాన్ని కోల్పోయా. ఇక తిరిగి పుంజుకోవడమే నా ముందున్న కర్తవ్యం'అని బోల్ట్ పేర్కొన్నాడు.


లండన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్ తరువాత కెరీర్ కు గుబ్ బై చెప్పబోతున్న బోల్ట్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి జరిగిన 100 మీటర్ల రేసులో మాత్రం తన జోరు కొనసాగించలేకపోయాడు. 9.95 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. అమెరికా స్టార్‌ స్పింటర్‌ జస్టిన్‌ గాట్లిన్‌ ఈ సారి బోల్ట్‌ను వెనక్కి నెట్టి స్వర్ణం ఎగరేసుకుపోయాడుగాట్లిన్‌ 9.92 సెకన్లలో పరుగును పూర్తి చేయగా క్రి‍ష్టియన్‌ కోలెమన్‌( అమెరికా) 9.94 సెకన్లు, జమైకా స్టార్‌ ఉసేన్‌ బోల్ట్‌ 9.95 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు