ఐసీసీ.. ఇది ఎలా సాధ్యం?

23 May, 2020 16:37 IST|Sakshi

సలైవా నిషేధం చాలా కష్టం: బ్రెట్‌ లీ

అది నాకు అలవాటు: డుప్లెసిస్‌

కేప్‌టౌన్‌: ఏ ఒక్కరూ బంతిపై సలైవా(లాలాజలాన్ని)ను రుద్దు కూడదనే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) మార్గదర్శకాలపై మళ్లీ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఈ ప్రతిపాదన తర్వాత పలువురు క్రికెటర్లు దీన్ని తప్పుపట్టగా, దాన్ని పాటించాలనే కచ్చితమైన గైడ్‌లైన్స్‌ తర్వాత కూడా అదే తరహా నిరసన వ్యక్తమవుతుంది. ఈ నిబంధనను ప్రవేశ పెట్టినంత సులువుగా అమలు చేయడం సాధ్యపడదని ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ  స్పష్టం చేశాడు. ఈ విషయంలో రాత్రికే రాత్రే ఇందులో మార్పులు ఆశించడం తగదన్నాడు ఎప్పుట్నుంచో అలవాటుగా వస్తున్న దీన్ని ఆకస్మికంగా నిషేధం విధించడం చెప్పినంత తేలిక కాదనే విషయాన్ని ఐసీసీ తెలుసుకోవాలన్నాడు. మనం బంతిని పట్టుకున్న వెంటనే వేళ్లను నోటితో తడిచేసుకుని రుద్దడం ఎప్పుట్నుంచో వస్తుందని, దీన్ని వదిలేయాలంటే క్రికెటర్లు కత్తిమీద సాము చేసినట్లేనన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు)

ఇక డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ఒక బౌలర్ల విషయంలోనే కాకుండా, ఫీల్డర్లు కూడా దీన్ని అనుసరిస్తూ వస్తున్నారన్నాడు. తాను బంతిని స్లిప్‌లో అందుకున్న వెంటనే నోటితో వేళ్లను తడిచేసుకుని రుద్దుతూ ఉంటానన్నాడు. అది తనకు అలవాటుగా మారిపోయిందన్నాడు. గతంలో రికీ పాంటింగ్‌ కూడా ఇలానే చేసేవాడనే విషయాన్ని ప్రస్తావించాడు. అది అనుకోకుండా జరిగిపోయే చర్య అని, దీన్ని ఒక్కసారిగా వదిలేయాలంటే ఈజీ కాదన్నాడు. కాగా, కరోనా వైరస్‌ సంక్షోభంతో భౌతిక దూరం అనే నిబంధనను మనం ఇప్పుడు చూస్తున్నాం. దాంతోపాటు పెద్ద ఎత్తున మాస్క్‌లు ధరించడం కూడా నిబంధనల్లో భాగమైపోయింది. కరోనా వైరస్‌ మనిషి నుంచి మనిషికి నోటి ద్వారానే ఎక్కువ శాతం సోకే అవకాశం ఉండటంతో ఐసీసీ కీలక మార్పులు తీసుకొచ్చింది. క్రికెట్‌ గేమ్‌లో భాగమై పోయిన బంతిపై సలైవా రుద్దడాన్ని ఉన్నపళంగా నిలిపివేసింది. దాంతో క్రికెటర్లకు ఇది పెద్ద సవాల్‌గా మారిపోయింది. (నలుగురు టీమిండియా క్రికెటర్లు.. కానీ కోహ్లి లేడు)

మరిన్ని వార్తలు