ఆ కల నెరవేరింది

5 Nov, 2015 20:13 IST|Sakshi
ఆ కల నెరవేరింది

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేయాలన్న తన చిరకాల కోరిక  నేరవేరిందని పాకిస్థాన్ సంతతికి చెందిన ఉస్మాన్ ఖవాజా(28) స్పష్టం చేశాడు. గత మూడు-నాలుగు సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియా తరపున సెంచరీ చేయాలన్నకల బలంగా ఉన్నా.. ఇన్నాళ్లకు  తీరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.  'నా జీవితంలో ఆస్ట్రేలియా తరపున టెస్టు సెంచరీ చేయాలన్న కోరిక బలంగా ఉండేది. అది ఇన్నాళ్లకు తీరడంతో నాకు పెద్ద ఉపశమనం లభించింది' అని ఉస్మాన్ ఖవాజా పేర్కొన్నాడు. 

 

చాలాకాలం తరువాత న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో అవకాశం పొందిన ఉస్మాన్ అదరగొట్టాడు. కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో 123 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని ఆస్ట్రేలియాను పటిష్ట స్థితికి చేర్చడంలో సాయపడ్డాడు.  రెండో వికెట్ కు డేవిడ్ వార్నర్ తో కలిసి 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.   ప్రస్తుతం ఉసాన్(102 బ్యాటింగ్),  స్మిత్(41 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు .  అంతకుముందు వార్నర్(163), బర్స్స్(71) పెవిలియన్ కు చేరారు.  దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు మైకేల్ క్లార్క్, షేన్ వాట్సన్ లు ఇటీవల టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో ఉస్మాన్ తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2011 లో ఇంగ్లండ్ తో సిడ్నీలో జరిగిన మ్యాచ్ ద్వారా ఉస్మాన్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీయర్ ను ఆరంభించాడు. అనంతరం ఆడపా దడపా అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో చాలా కాలం జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 

మరిన్ని వార్తలు