జీతూ రాయ్ కు రూ.50 లక్షల నజరానా

20 Sep, 2014 15:56 IST|Sakshi
జీతూ రాయ్ కు రూ.50 లక్షల నజరానా

ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో తొలిస్వర్ణం సాధించిన భారత షూటర్, ఉత్తరప్రదేశ్ క్రీడాకారుడు జీతూ రాయ్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలు నజరానా ప్రకటించింది. ఇచియాన్ లో ఆరంభమైన ఆసియా క్రీడల్లో  జీతూ స్వర్ణం సాదించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నజరానాను ప్రకటించారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఏషియన్ గేమ్స్లో ప్రపంచ ఐదో నంబర్ క్రీడాకారుడు జీతూ రాయ్ భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 

 

చైనా రజిత, కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. కాగా మహిళల విభాగంలో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాంస్యాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆసియా క్రీడల్లో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ మహిళల విభాగంలో భారత్, మకావు బరిలో దిగనున్నాయి.. సైనా నెహ్వాల్, సింధూ  ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో తలపడనున్నారు. ఇక బ్యాడ్మింటన్ ప్రీక్వార్టర్స్ పురుషుల విభాగంలో భారత్, కొరియా పోటీ పడతాయి.

మరిన్ని వార్తలు