వరుణి జైస్వాల్‌కు రెండు టైటిళ్లు

12 Aug, 2019 10:10 IST|Sakshi

రాష్ట్ర ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వరుణి జైస్వాల్‌ (జీఎస్‌ఎం) ఆకట్టుకుంది. ఆమె మహిళల, యూత్‌ బాలికల సింగిల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. జూనియర్‌ బాలికల విభాగంలో ఎన్‌. భవిత (జీఎస్‌ఎం), పురుషుల విభాగంలో అమన్‌ (సీఆర్‌ఎస్‌సీబీ), యూత్‌ బాలుర కేటగిరీలో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ (జీటీటీఏ), జూనియర్‌ బాలుర విభాగంలో బి. వరుణ్‌ శంకర్‌ (ఎంఎల్‌ఆర్‌) చాంపియన్‌లుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో వరుణి జైస్వాల్‌ 7–11, 11–9, 11–8, 10–12తో నిఖత్‌ బాను (ఆర్‌బీఐ)పై గెలుపొందింది. ఐదో గేమ్‌లో నిఖత్‌ బాను గాయం కారణంగా వైదొలగడంతో వరుణిని విజేతగా ప్రకటించారు. పురుషుల తుదిపోరులో అమన్‌ 11–8, 7–11, 11–8, 8–11, 11–9, 11–9తో స్నేహిత్‌ (జీటీటీఏ)ను ఓడించాడు.

యూత్‌ బాలికల ఫైనల్లో వరుణి 8–11, 11–9, 11–13, 11–7, 11–5, 8–11, 11–7తో రాగ నివేదిత (జీటీటీఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్నేహిత్‌ 11–4, 11–7, 11–7, 11–4తో కేశవన్‌ కన్నన్‌ (ఎంఎల్‌ఆర్‌)ను ఓడించాడు. జూనియర్‌ బాలికల టైటిల్‌పోరులో భవిత 11–1, 11–3, 4–11, 11–2, 11–8తో మెర్సీ (హెచ్‌వీఎస్‌)పై నెగ్గింది. బాలుర తుదిపోరులో వరుణ్‌ శంకర్‌ 11–2, 11–8, 11–7, 11–4తో సాయినాథ్‌ రెడ్డి (ఎంఎల్‌ఆర్‌)పై విజయం సాధించాడు. సబ్‌ జూనియర్‌ బాలుర విభాగంలో త్రిశూల్‌ మెహ్రా (ఎల్‌బీఎస్‌), జషాన్‌ సాయి (ఎంఎల్‌ఆర్‌) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్‌ మ్యాచ్‌ల్లో కరన్‌ సప్తర్షి (ఎంఎల్‌ఆర్‌)పై, త్రిశూల్‌ మెహ్రా, ఇషాంత్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌)పై జషాన్‌ సాయి నెగ్గారు. బాలికల విభాగంలో మెర్సీ (హెచ్‌వీఎస్‌), పలక్‌ (జీఎస్‌ఎం), శ్రీయ (జీఎస్‌ఎం), అనన్య (జీఎస్‌ఎం) సెమీస్‌కు చేరుకున్నారు. క్యాడెట్‌ బాలబాలికల్లో జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌), ధ్రువ్‌ సాగర్, శౌర్య రాజ్‌ (ఏవీఎస్‌సీ), స్మరణ్, శ్రీయ, శ్రీయ, ప్రజ్ఞాన్ష (వీపీజీ), పి. జలానీ (వీపీజీ) సెమీస్‌కు చేరారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా