క్రికెటర్‌ను తప్పిస్తే సమాచారం ఇవ్వరా?

3 Jun, 2020 18:16 IST|Sakshi

ఆధునిక క్రికెట్‌లో ఇది చాలా దారుణం

ప్లంకెట్‌ ఉద్వాసనపై వాన్‌ ఫైర్‌

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఇంగ్లండ్‌ జట్టులో చోటు కోల్పోయిన ఇంగ్లండ్ పేసర్‌ లియామ్‌ ప్లంకెట్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ మద్దతుగా నిలిచాడు. ఇటీవల 55 మందితో కూడిన ఇంగ్లండ్‌ జట్టును ట్రైనింగ్‌ సెషన్‌ కోసం ఎంపిక చేయగా అందులో ప్లంకెట్‌ పేరు లేదు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఆలస్యం తెలుసుకున్న వాన్‌.. కనీసం అతనికి చెప్పకుండా ఎలా తీసేస్తారని ప్రశ్నించాడు. జట్టును ఎంపిక చేసే క్రమంలో ఎటువంటి వివక్ష చూపకుండా ఉండాలనే ప్రధాన సూత్రాన్ని సెలక్టర్లు మరిచిపోయారని వాన్‌ విమర్శించాడు. ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ప్లంకెట్‌పై ఎందుకు అంతటి వివక్ష అని నిలదీశాడు. (ఒక్కసారి దాదా ఫిక్స్‌ అయ్యాడంటే..)

ప్రధానంగా అతనికి చెప్పకుండా జట్టు నుంచి తీసేయడాన్ని వాన్‌ ప్రశ్నించాడు. గతంలో ఒకానొక సందర్భంలో తాను అమెరికాకు ఆడే అవకాశం వస్తే ఆ దేశం తరఫున ఆడతానని ప్లంకెట్‌ చెప్పిన నేపథ్యంలోనే అతనిపై వేటుకు కారణమైంది. కాగా, ఈ విషయాన్ని ప్లంకెట్‌కు చెప్పి తీయాలని అంటున్నాడు వాన్‌. ప్లంకెట్‌ భార్య అమెరికా జాతీయురాలు కావడంతో వివాదానికి కారణమైంది. ప్రస్తుతం ప్లంకెట్‌ కూడా ఇంగ్లండ్‌ జట్టుకు అందుబాటులో లేడు. భార్యతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. దాంతో ప్లంకెట్‌ను పక్కన పెట్టేశారు ఇంగ్లండ్‌ సెలక్టర్లు. అయితే ఒకసారి ప్లంకెట్‌కు చెప్పి తీస్తే బాగుంటుందనేది వాన్‌ అభిప్రాయం. అలా చేయకపోతే ఈ ఆధునిక క్రికెట్‌లో ఒక క్రికెటర్‌ను అవమానించినట్లేనని స్పష్టం చేశాడు. ఆలస్యంగా తెలుసుకున్న ఈ వార్త తనను నిరాశకు గురి చేసిందన్నాడు.

మరిన్ని వార్తలు