బీబీఎల్ లో మరో భారత క్రీడాకారిణి

19 Oct, 2017 14:04 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో ఆడటానికి మరో భారత క్రీడాకారిణికి అవకాశం దక్కింది. ఇప్పటికే ఈ లీగ్ లో ఇద్దరు భారత క్రీడాకారుణులు హర్మన్ ప్రీత్ కౌర్,  స్మృతి మంధన ఆడుతుండగా, తాజాగా ఇందులో ఆడేందుకు మరో భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తికి అవకాశం దక్కింది. బీబీఎల్ మహిళల మూడో ఎడిషన్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడేందుకు వేదా ఒప్పందం చేసుకుంది.

ఈ మేరకు వేద మాట్లాడుతూ.. బీబీఎల్ ఆడే అవకాశం వస్తుందని అనుకోలేదు. ఆ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నెలరోజుల క్రితమే హరికేన్స్ యాజమాన్యంతో మాట్లాడా. ఆపై హర్మన్, మంధనాలతో చర్చించా. కాకపోతే అప్పటికి సఫారీల షెడ్యూల్ ఖరారు కాలేదు. దాంతో అప్పుడు వారితో ఏమీ చెప్పలేదు. మా దక్షిణాఫ్రికా పర్యటన ఫిబ్రవరిలో ఉండటంతో బీబీఎల్ ఆడేందుకు నాకు మార్గం సుగుమం అయ్యింది. దాంతో హరికేన్స్ నిర్వహకులతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నా. ఆ జట్టుతో 10 మ్యాచ్ లతో మాత్రమే ఆడతా.ఈ విషయాన్ని వారితో చెప్పా. అందుకు హరికేన్స్ యాజమాన్యం ఒప్పుకుంది'అని వేద పేర్కొన్నారు. బీబీఎల్ లో సిడ్నీ థండర్స్ తరపున హర్మన్ ఆడుతుండగా, బ్రిస్బేన్ హీట్ కు మంధన ఆడుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు