కోచ్ రేసులో మరో మాజీ క్రికెటర్

30 Jun, 2017 07:34 IST|Sakshi
కోచ్ రేసులో మరో మాజీ క్రికెటర్

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలిగిన తర్వాత ఆ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రెండో సారి దరఖాస్తుల్ని ఆహ్వానించిన తరువాత  కోచ్ పదవి కోసం ముందుగా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి రేసులోకి రాగా, తాజాగా వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో నిలిచారు.

1996లో భారత్ క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన వెంకేటేశ్ ప్రసాద్.. 33 టెస్టులు, 162 వన్డేలను ఆడాడు. ప్రస్తుతం జూనియర్ క్రికెట్ జట్టుకు వెంకటేశ్ ప్రసాద్ పని చేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ తో అతని మూడేళ్ల పదవి కాలం ముగియనుంది. దాంతో భారత జట్టుకు కోచ్ గా చేసేందుకు మొగ్గుచూపుతున్న వెంకటేశ్ ప్రసాద్ దరఖాస్తు చేసుకున్నాడు. అంతకుముందు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారిలో  టామ్‌ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్‌ పైబస్, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లు ఉన్నప్పటికీ రవిశాస్త్రి, వెంకటేశ్ ప్రసాద్ లు వారితో కలిశారు.

మరిన్ని వార్తలు