కాంస్య పతక పోరుకు జ్యోతి సురేఖ

14 Jun, 2019 06:00 IST|Sakshi

మహిళల కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ విశేషంగా రాణించింది. ఆమె రెండు కాంస్య పతకాల కోసం పోటీపడనుంది. జ్యోతి సురేఖ, ముస్కాన్, రాజ్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల కాంపౌండ్‌ జట్టు సెమీఫైనల్లో 226–227తో అమెరికా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు తొలి రౌండ్‌లో బై పొందిన భారత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 236–226తో ఫ్రాన్స్‌పై... క్వార్టర్‌ ఫైనల్లో 219–213తో నెదర్లాండ్స్‌పై గెలిచింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో టర్కీతో భారత్‌ ఆడుతుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలోనూ జ్యోతి సురేఖ కాంస్యం కోసం బరిలో ఉంది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 140–143తో పియర్స్‌ పైజి (అమెరికా) చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో యాసిమ్‌ బోస్టాన్‌ (టర్కీ)తో సురేఖ ఆడుతుంది. సురేఖ క్వార్టర్‌ ఫైనల్లో 147–141తో సారా ప్రీల్స్‌ (బెల్జియం)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ‘షూట్‌ ఆఫ్‌’లో తాంజా జెన్సన్‌ (డెన్మార్క్‌)పై, మూడో రౌండ్‌లో 146–143తో బోమిన్‌ చోయ్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు