అదరగొట్టిన అజెరెంకా

24 Jan, 2015 14:10 IST|Sakshi
అదరగొట్టిన అజెరెంకా

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి విక్టోరియా అజెరెంకా నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మూడో రౌండ్ లో అజెరెంకా 6-4, 6-4 తేడాతో ప్రపంచ 25 వ ర్యాంకర్ జహ్లవోవా స్టిరికోవాపై విజయం సాధించి నాల్గో రౌండ్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్ అడ్డంకిని సునాయాసంగా దాటిన అజెరెంకా..   రెండో గేమ్ లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తన అనుభవాన్ని ఉపయోగించిన అజెరెంకా రెండో సెట్ ను కూడా కైవశం చేసుకుని నాల్గో రౌండ్ కు చేరుకుంది.

ఇదిలా ఉండగా మరో మూడో రౌండ్ లో ప్రపంచ 6 ర్యాంకర్ రద్వాన్ ష్కా6-0, 7-5 తేడాతో 30 వ ర్యాంకర్ లెప్చెన్కో  పై విజయం సాధించింది. ప్రపంచ 18 నంబర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 4-6, 7-6, 6-1 తేడాతో జియార్జిపై విజయం సాధించగా,  నాల్గో నంబర్ క్రీడాకారిణి వావ్రింకా 6-4,6-2, 6-4 నిమినన్ పై గెలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు