అజరెంకాదే టైటిల్

9 Jan, 2016 18:29 IST|Sakshi
అజరెంకాదే టైటిల్

బ్రిస్బేన్: మాజీ ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది.  బ్రిస్బేన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో భాగంగా శనివారం జరిగిన తుదిపోరులో అజరెంకా విజేతగా నిలిచింది. ఆద్యంత ఆకట్టుకున్న అజరెంకా 6-3, 6-1 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ బోల్తాకొట్టించి టైటిల్ ను కైవసం చేసుకుంది.

 

ఒక గంటా 13 నిమిషాలపాటు జరిగిన అంతిమ పోరులో అజరెంకా వరుస సెట్లను గెలిచి  కెర్బర్ పై మరోసారి పైచేయి సాధించింది. అంతకుముందు వీరిద్దరూ తలపడిన ఐదు సార్లు అజరెంకానే విజయం సాధించింది. ఇదిలా ఉండగా 2013 ఆగస్టు తరువాత అజరెంకాకు ఇదే తొలి టైటిల్. 2014 లో గాయం కారణంగా కేవలం తొమ్మిది టోర్నమెంట్లలోనే అజరెంకా పాల్గొంది. ఆ తరువాత 2015 లో తొడ కండరాల గాయం కారణంగా పలు టోర్నీల్లో వైఫల్యం చెందడంతో ఆమె ర్యాంకింగ్స్ లో గణనీయంగా కిందికి పడిపోయింది. 2016 సీజన్ ను టైటిల్ తో శుభారంభం చేసిన అజరెంకా.. త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్  లో అగ్రశ్రేణి క్రీడాకారిణులు సవాల్ గా మారే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు