'ఫిట్టర్ క్రికెటర్ గా తయారవుతా'

16 Jun, 2017 16:13 IST|Sakshi
'ఫిట్టర్ క్రికెటర్ గా తయారవుతా'

న్యూఢిల్లీ: గత రెండు నెలల క్రితం మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ తిరిగి కోలుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ ట్రైనర్ రజనీకాంత్ పర్యవేక్షణలో ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటున్నట్లు విజయ్ తెలిపాడు. వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కు సంబంధించి భారత జట్టులో స్థానం సంపాదించడంపైనే తన దృష్టిని కేంద్రీకరించినట్లు పేర్కొన్నాడు.

 

'గాయం నుంచి కోలుకునే పనిలో ఉన్నాను. మరొకొద్ది రోజుల్లో ఫిట్గా తయారవుతా. ఎన్సీఏ ట్రైనర్ రజనీ కాంత్ నా ఫిట్ నెస్ ను పర్యవేక్షిస్తున్నారు. నా ఫిట్నెస్ మెరుగుదలకు రజనీకాంత్ సరైన వ్యక్తి అనుకుంటున్నా. అత్యుత్తమ ట్రైనర్ అయిన అతనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. త్వరలో ఫిట్టర్ క్రికెటర్ గా తయారవుతా' అని మురళీ విజయ్ తెలిపాడు.

గాయం కారణంగా ఐపీఎల్-10 సీజన్ కు మురళీ విజయ్ దూరమైన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ నెలలో అతని మణికట్టుకు ఇంగ్లండ్ లో ఆపరేషన్ చేయించుకున్న విజయ్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఆపై చెన్నైలో ట్రైనర్ రజనీకాంత్ సమక్షంలో ఫిట్ నెస్ కు మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు.

>
మరిన్ని వార్తలు