వికాస్, తేజోధర్ సెంచరీలు

11 Oct, 2014 01:18 IST|Sakshi
వికాస్, తేజోధర్ సెంచరీలు

సాక్షి, హైదరాబాద్: కె. వికాస్ (85 బంతుల్లో 115; 15 ఫోర్లు), బి. తేజోధర్ (72 బంతుల్లో 114; 16 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగడంతో ‘ఎ’ డివిజన్ వన్డే నాకౌట్ లీగ్ టోర్నమెంట్‌లో సౌత్ ఎండ్ రేమండ్స్ జట్టు 321 పరుగుల భారీ తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టును చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఎండ్ 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 386 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రంగారెడ్డి జట్టు 15.2 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలింది. ప్రఫుల్ (5/26), హర్షవర్ధన్ (5/22) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

     ఇంటర్నేషనల్ సీసీ: 105 (విపిన్ 28, నైరుత్ రెడ్డి 5/22, నసీర్ 3/12), దక్కన్ బ్లూస్: 106/1 (రఘు 51 నాటౌట్).
     మాంచెస్టర్: 100 (ముస్తఫా 3/18), రెడ్ హిల్స్: 103/6 (చైతన్య 3/22).
     పీకేసీసీ: 104 (అగ్రజ్ 41, జగన్ 3/19, సాయి 3/27), శాంతి ఎలెవన్: 55 (రాహుల్ 4/14, శామ్యూల్ 3/16).
     స్టార్‌లెట్స్: 189/8 (సురేశ్ 55, రతన్‌తేజ 37, వాహెద్ 3/34), పికెట్: 130 (తహసీన్ 48, సంతోష్ 41, రతన్‌తేజ 4/28).
     సాగర్ ఎలెవన్: 138 (అఖిల్ 30, విశాల్ 4/18), నటరాజ్: 139/5 (రహీముద్దీన్ 38, కిషోర్ 30).
     గోల్కొండ సీసీ: 40 (విద్యానంద్ 5/15, షానవాజ్ 3/7), మహమూద్ సీసీ: 41/0.
     క్లాసిక్: 214/5 (నవీన్ 52, ఖుబింద్ 49), విజయ్ సీసీ: 174/9 (సుబ్రహ్మణ్యం 45, సాయిరామ్ 32, అస్లాం సిద్దిఖీ 4/13).
     సన్‌షైన్: 168 (చరణ్ 43, భరద్వాజ్ 30), ఎస్‌ఎన్ గ్రూప్: 172/5 (శంతన్ 93, మెర్విన్ 34).
     యాదవ్ డెయిరీ: 213 (సాత్విక్ 30, నరసింహ 6/36, ఫైజల్ 3/40), పీఎన్ యంగ్‌స్టర్స్: 214/7 (శ్రీకాంత్ 47, నరసింహ 37, కమ్రాన్ 36, హసీబ్ 32, రోహిత్ 3/30).
     కాకతీయ: 263 (సాయి 90, రవి 32, శశాంక్ 4/41), విజయానంద్: 198/9 (సన 89, పవన్ 3/34).

 

>
మరిన్ని వార్తలు