వినేశ్‌ ఓడింది కానీ..!

18 Sep, 2019 03:04 IST|Sakshi

‘టోక్యో’ దారి ఇంకా ఉంది

ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌  

నూర్‌–సుల్తాన్‌ (కజకిస్తాన్‌): ప్రపంచ రెజ్లింగ్‌చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పరాజయం చవిచూసింది. అయితే ఇక్కడ ఆమె పసిడి ‘పట్టు’ ముగిసినా... టోక్యో దారి మిగిలే ఉంది. మహిళల 53 కేజీల కేటగిరీలో ఆమెకు ‘రెపిచేజ్‌’తో కాంస్యం గెలిచే అవకాశాలున్నాయి. మరో మహిళా రెజ్లర్‌ సీమా బిస్లా (50 కేజీలు) కూడా ఓడినప్పటికీ, వినేశ్‌ లాగే ఒలింపిక్స్‌ బెర్తు, కాంస్యం చేజిక్కించుకునే అవకాశాలు మిగిలే ఉన్నాయి. మంగళవారం జరిగిన 53 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మయు ముకయిద (జపాన్‌) 7–0తో వినేశ్‌ను ఓడించింది. అనంతరం ఈ జపాన్‌ రెజ్లర్‌ తన జైత్రయాత్ర కొనసాగించి గెలిచి ఫైనల్‌ చేరింది. దీంతో వినేశ్‌కు నేడు జరిగే ‘రెపిచేజ్‌’లో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఆమె కాంస్యం గెలవాలంటే ముగ్గురిని ఓడించాలి.

లేదంటే కనీసం ఇద్దరిపై గెలిచినా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదిస్తుంది. యులియా (ఉక్రెయిన్‌), ప్రపంచ నంబర్‌వన్‌ సారా అన్‌ (అమెరికా), ప్రివొలరకి (గ్రీస్‌)లతో వినేశ్‌ తలపడనుంది. ఇప్పటివరకు కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వినేశ్‌... ప్రపంచ రెజ్లింగ్‌లో మాత్రం నెగ్గలేకపోయింది. 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో సీమా 2–9తో మరియా స్టాండిక్‌ (అజర్‌బైజాన్‌) చేతిలో పరాజయం చవిచూసింది. మూడు ఒలింపిక్‌ పతకాల విజేత అయిన మరియా ఫైనల్‌ చేరడంతో సీమా కూడా ‘రెపిచేజ్‌’ అవకాశం దక్కించుకుంది. ఒలింపిక్స్‌ అర్హత సాధించాలంటే ఆమె... మెర్సి(నైజీరియా), పొలెస్‌చుక్‌ (రష్యా)లను ఓడించాలి. కాంస్యం నెగ్గాలంటే వారిద్దరితో పాటు చైనా రెజ్లర్‌ యనన్‌ సన్‌పై గెలవాలి. భారత్‌కే చెందిన కోమల్‌ (72 కేజీలు), లలిత (55 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. వారిని ఓడించిన రెజ్లర్లు ఫైనల్‌కు చేరకపోవడంతో మరో అవకాశం లేకుండా పోయింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ క్రికెటర్లకు... బిర్యానీ, స్వీట్స్‌ బంద్‌

శుబ్‌మన్‌ మళ్లీ శతకం మిస్‌

సాత్విక్–అశ్విని జోడీ సంచలనం

పతకాలకు పంచ్‌ దూరంలో...

బోణీ కొట్టేనా!

‘ధోని-కోహ్లిలను కలిసే ధైర్యం చేయరు’

మానిన గాయాన్ని మళ్లీ రేపారు..స్టోక్స్‌ ఆవేదన

మెరిసి.. అంతలోనే అలసి

‘అలాంటి భారత బౌలర్‌ని చూడలేదు’

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

ఇక పాక్‌ క్రికెటర్లకు బిర్యానీ బంద్‌?

ప్రపంచ చాంపియన్‌షిప్‌: మెరిసిన ఫొగట్‌

అందుకు జోఫ్రా ఆర్చరే కారణం: స్టోక్స్‌

మన హీరోల్ని ట్రీట్‌ చేసే విధానం ఇదేనా?

కోహ్లి, సెలక్టర్ల ఆలోచన ఎలా ఉందో?

ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌కు అరుణా రెడ్డి

నవనీత్‌–సాహితి జంటకు టైటిల్‌

ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్‌

రెండో రౌండ్‌ దాటలేదు

జపాన్‌ చేతిలో భారత్‌ ఓటమి

గెలిస్తేనే నిలుస్తారు

160 కోట్ల మంది చూశారు!

41బంతుల్లో సెంచరీ

తెలుగు టైటాన్స్‌ పరాజయం

దినేష్‌ కార్తీక్‌కు ఊరట

టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్‌!

స్మిత్‌ 1, కోహ్లి 2

సత్తాకు పరీక్ష

ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌.. సీనియర్లపై వేటు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

విక్రమ్‌ కనిపించిందా!?

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌