ప్రపంచ చాంపియన్‌షిప్‌కు వినేశ్‌ ఫొగాట్, సాక్షి 

29 Jul, 2019 02:00 IST|Sakshi
వినేశ్‌ ఫొగాట్‌

ట్రయల్స్‌లో సత్తా చాటిన భారత స్టార్‌ రెజ్లర్లు  

లక్నో: ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్లు వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), సాక్షి మలిక్‌ (62 కేజీలు) సత్తా చాటారు. ఆదివారం జరిగిన ఈ ట్రయల్స్‌ ఫైనల్‌ బౌట్‌లో వినేశ్‌ ఫొగాట్‌ 9–0తో పింకీపై గెలుపొందగా... రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌  13–2తో రేష్మా మన్‌ను అలవోకగా ఓడించి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. వీరిద్దరితో పాటు సీమా బిస్లా (50 కేజీలు), సరితా మోర్‌ (57 కేజీలు), దివ్య కక్రాన్‌ (68 కేజీలు), కిరణ్‌ గొడారా (76 కేజీలు) వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. దివ్య కక్రాన్‌ 6–3తో నవ్‌జోత్‌ కౌర్‌పై విజయం సాధించగా... 57 కేజీల విభాగంలో బెర్త్‌ కోసం పూజ, అన్షు మలిక్, మంజు, సరిత గట్టిగా పోటీపడ్డారు. కానీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత పూజ దండాను వెనక్కి నెట్టి సరిత భారత జట్టులోకి ఎంపికైంది. కజకిస్తాన్‌ వేదికగా సెప్టెంబర్‌ 14 నుంచి 22 వరకు ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు ఖరారు అవుతుంది. ఆదివారం జరిగిన ట్రయల్స్‌ వెయిట్‌ కేటగిరీలన్నీ ఒలింపిక్స్‌లో భాగంగా ఉండగా... ఆగస్టు రెండో వారంలో ఒలింపిక్స్‌ క్రీడల్లో లేని వెయిట్‌ కేటగిరీలకు ట్రయల్స్‌ నిర్వహిస్తారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ 

సరే... అలాగే చేద్దాం

పసిడి కాంతలు 

హర్భజన్‌, ద్యుతీ చంద్‌ నామినేషన్లు తిరస్కరణ!

అవకాశాలు ఇస్తనే కదా.. సత్తా తెలిసేది

మేరీ కోమ్‌ మెరిసింది!

ప్రేమ జంట.. మధ్యలో యువీ!

చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?

కోహ్లి కబడ్డీ జట్టు ఇదే..!

ఇంగ్లండ్‌కు ఆమిర్‌ మకాం!

సత్తా చాటుతున్న మన బా'క్సింగ్‌'లు

రోహిత్‌తో వివాదం.. కోహ్లి వస్తాడా..రాడా?

రవిశాస్త్రిపై సంచలన వ్యాఖ్యలు!

యువీ.. వాటే సిక్స్‌

మరోసారి ‘రికార్డు’ సెంచరీ

ఎంవీ శ్రీధర్‌పై పుస్తకం

టైటిల్‌కు మరింత చేరువలో ప్రీతి

ప్రత్యూషకు నాలుగో స్థానం

పోరాడి ఓడిన దివిజ్‌–ఎల్రిచ్‌ జంట

హామిల్టన్‌కు 87వ ‘పోల్‌’

షమీకి అమెరికా వీసా తిరస్కరణ, మంజూరు

జయహో... యు ముంబా

సెమీస్‌తో సరి

షూటింగ్‌ లేకుంటే... 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను బహిష్కరిద్దాం

నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు

గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్‌

పుణెరీని బోల్తా కొట్టించిన యు ముంబా

ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ

బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్‌ క్రికెటర్‌ నో? 

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌