కాంబ్లీ ట్వీట్‌పై శాంసన్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

24 Apr, 2018 18:36 IST|Sakshi
సంజూ శాంసన్‌ (ఫైల్‌ ఫొటో)

దక్షిణాది ఆటగాడు కావడంతోనే కాంబ్లీ విమర్శలు

సెంచరీ చేయాలని సవాల్‌ విసిరిన కాంబ్లీ

ముంబై : ఐపీఎల్‌-11 సీజన్‌లో తన బ్యాటింగ్‌ శైలితో ఆకట్టుకుంటున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌పై మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కేరళకు చెందిన ఈ యువ ఆటగాడిపై కాంబ్లీ విమర్శలు చేయడం.. క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన శాంసన్‌ రెండు అర్ధ సెంచరీలతో 239 పరుగులు సాధించి ఆరేంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. 

ప్రస్తుతం టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్న శాంసన్‌ ఆరెంజ్‌ క్యాప్‌కి అనర్హుడంటూ కాంబ్లీ ట్వీట్‌ చేశాడు. టీవీ కామెంటేటర్లు శాంసన్‌ను కొనియాడటంపై కూడా కాంబ్లీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఎంత సేపు అతని గురించే మాట్లాడుతారా.. వేరే పని లేదా’ అని వారిని విమర్శించాడు. కాంబ్లీ ట్వీట్‌లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంసన్‌ దక్షిణాది క్రీడాకారుడు కాబట్టే మీరు అలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన కాంబ్లీ.. శాంసన్‌ బ్యాటింగ్‌లో నిలకడ లేదని, అతను గొప్ప ఆటగాడని నిరూపించుకోవాలంటే ఈ టోర్నీలో సెంచరీ చేయాలని సవాలు విసిరాడు. అలా చేస్తే తాను కూడా అతడో ప్రత్యేకమైన ఆటగాడని ఒప్పుకుంటానని తెలిపాడు.

>
మరిన్ని వార్తలు