అమ్మాయికి ముద్దు పెట్టిన టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌

24 Jan, 2020 13:07 IST|Sakshi

కాన్‌బెర్రా: క్రీడాకారులు వేసిన గురి సరిగ్గా తగిలిందంటే అందరి ప్రశంసలు అందుకుంటారు. కానీ గురి తప్పిందంటే చాలు విమర్శలపాలవుతారు. కానీ ఇక్కడ గురి తప్పినందుకు ఓ స్టార్‌ క్రీడాకారుడు వార్తల్లో నిలిచాడు. స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ గురువారం ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీ ఆడుతున్నాడు. ఈ సమయంలో బాల్‌ను తన ప్రత్యర్థి వైపు కొట్టగా అది గురి తప్పి నేరుగా వెళ్లి అంపైర్‌కు వెనకాల నిలబడ్డ ఓ అమ్మాయికి తగిలింది. వెంటనే ప్రేక్షకులు ఏమైందేమోనని భయంతో గట్టిగా అరిచారు. ఆ అమ్మాయికి దెబ్బ తగిలిందేమోనని రఫెల్‌ అటువైపు చూడగా ఆమె బాగానే ఉన్నానంటూ సైగ చేసింది. కానీ రఫెల్‌ ఆమె సమాధానం విని ఊరుకోలేదు. వెంటనే ఆమెను సమీపించి ఏమీ కాలేదు కదా అని ఆరా తీశాడు. అనంతరం ఆ బాలిక టోపీ పక్కకు జరిపి ఆమె చెంపకు ఆప్యాయంగా ముద్దు పెట్టి తలనిమిరి వెళ్లిపోయాడు.

ఈ అనూహ్య పరిణామానికి ఆమె బుగ్గలు ఎరుపెక్కగా, ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. ఇక మ్యాచ్‌ అనంతరం రఫెల్‌ నాదల్‌ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘ఆమె గురించి నాకు చాలా భయమేసింది. ఎందుకంటే ఆ బంతి నేరుగా ఆమె తలకు తగిలింది కానీ గాయం అవలేదు. అందుకు సంతోషంగా ఉంది. కానీ ఆమె చాలా తెలివైన అమ్మాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు వారి కళ్లను నమ్మలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ తనంతట తానుగా వెళ్లి ఓ అమ్మాయికి ముద్దు పెట్టడమా..’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. మరికొంతమందేమో రఫెల్‌ ఆమెపై కురిపించిన ప్రేమను చూసి మెచ్చుకుంటున్నారు.

చదవండి:

అయ్యో షరపోవా!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా