‘కేప్‌టౌన్‌’కు భారత్, దక్షిణాఫ్రికా జట్ల సాయం 

28 Feb, 2018 01:44 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, డు ప్లెసిస్‌

జొహన్నెస్‌బర్గ్‌: తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్‌టౌన్‌కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్లు 8,500 అమెరికన్‌ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు. గత శనివారం కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, డు ప్లెసిస్‌లు ‘గివర్స్‌ ఫౌండేషన్‌’కు అందజేశారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్‌టౌన్‌ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్‌ చెప్పాడు.     

మరిన్ని వార్తలు