వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి, బుమ్రా టాప్‌

12 Nov, 2019 19:55 IST|Sakshi

దుబాయ్‌ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్‌ విభాగంలో విరాట్ కోహ్లి, బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నెం-1గా, ఆల్ రౌండర్ల విభాగంలో భారత్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 895 పాయింట్లతో కోహ్లి మొదటిస్థానంలో ఉండగా.. 863 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనతో రోహిత్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు.

బౌలింగ్‌ విభాగంలో 797 పాయింట్లతో బుమ్రా నెం.1 స్థానాన్ని దక్కించుకోగా నెం.2 ర్యాంకులో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. ఆల్ రౌండర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌  క్రికెటర్‌ బెన్ స్టోక్స్‌ 319 పాయింట్లతో నెం.1 ర్యాంకులో నిలవగా, ఆఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ రెండవ స్థానంలో  నిలిచాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు.. తర్వాత ఆ జట్టుతో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ సిరీస్‌ తర్వాత డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ-20సిరీస్‌ ఆడనుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌ డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు