కోహ్లి.. చిరుత కంటే వేగంగా పరిగెత్తావు

7 Jun, 2020 14:28 IST|Sakshi

ఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎప్పుడెప్పుడు గ్రౌండ్‌లోకి దిగుదామా అని ఉవ్విళ్లురుతున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటికే పరిమితమైన కోహ్లి ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఫిట్‌నెస్‌కు సంబంధించి వీడియోలు షేర్‌ చేసిన కోహ్లి తాజాగా మరో వీడియోను షేర్‌ చేశాడు. తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న ఇండోర్‌ ట్రైనింగ్‌లో భాగంగా పరిగెడుతున్న వీడియోనూ ట్విటర్‌,ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కాగా వీడియోలో.. ఫాస్ట్‌ రన్నింగ్‌ మూమెంట్‌‌ను పార్ట్స్‌గా విభజింజి స్లోమూమెంట్స్‌ను పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'నా రన్నింగ్‌ మూమెంట్‌ ఎలా ఉందో మీరే చెప్పాలంటూ' అభిమానులను అడిగాడు. ('నన్ను చాలా దారుణంగా అవమానించారు')

కోహ్లి పెట్టిన క్యాప్షన్‌పై అభిమానులు, పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు స్పందించారు. 'చాలా చక్కగా ఎడిట్‌ చేశావ్‌ కోహ్లి' అంటూ టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కేము స్పందిస్తూ..' ఇది సరిపోదు.. నీ నుంచి చాలా ఆశిస్తున్నా' అంటూ తెలిపాడు. ' కోహ్లి.. చిరుత కన్నా వేగంగా పరిగెత్తావు' అంటూ కోహ్లి అభిమానులు పేర్కొన్నారు.
('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది')

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు