26 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి

11 Aug, 2019 20:58 IST|Sakshi

ట్రినిడాడ్‌ : వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లుగా పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ (1930 పరుగులు) పేరున ఉన్న రికార్డును తిరగరాశాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 19 వద్ద కోహ్లి మియాందాద్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక రన్‌మెషీన్‌గా పేరున్న కోహ్లి 34 మ్యాచ్‌ల్లోనే 71 సగటుతో ఈ ఘనత సాధించడం విశేషం.

విండీస్‌పై అత్యధికంగా కోహ్లి 7 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. కోహ్లి తొలి వన్డే, తొలి సెంచరీ చేసింది కూడా విండీస్‌పైనే కావడం విశేషం. మియాందాద్‌ 64 మ్యాచ్‌ల్లో 1930 పరుగులు చేసి రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మార్క్‌వా 47 మ్యాచ్‌ల్లో 1708 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. తదుపరి స్థానాల్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం జాక్వెస్‌​ కలిస్‌ 40 మ్యాచ్‌ల్లో 1666 పరుగులు... పాకిస్తాన్‌ ఆటగాడు రమీజ్ రాజా 53 మ్యాచ్‌లు 1624 పరుగులతో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు