‘నో డౌట్‌.. ఆ సామర్థ్యం కోహ్లిలో ఉంది’

4 May, 2020 12:41 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఎంఎస్‌ ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా కేఎల్‌ రాహుల్‌లో ఉందని అంటున్నాడు మాజీ వికెట్‌  కీపర్‌  దీప్‌దాస్‌ గుప్తా. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రాహుల్‌ కచ్చితంగా సరిపోతాడని దీప్‌దాస్‌ గుప్తా అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా ధోని క్రికెట్‌కు దూరంగా ఉంటున్న తరుణంలో అతని స్థానాన్ని భర్తీ చేసే అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అయితే ఇందుకు రాహులే కరెక్ట్‌ అంటున్నాడు  దీప్‌దాస్‌ గుప్తా. మరొకవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన 40 ఏళ్ల వయసులోనూ మెరుగ్గా క్రికెట్‌ ఆడగలడని ఈ మాజీ వికెట్‌ కీపర్‌ ధీమా వ్యక్తం చేశాడు. అటు ఫిట్‌నెస్‌ పరంగానే కాకుండా మానసికంగా కూడా కోహ్లి మెరుగ్గా ఉండటమే అందుకు కారణమన్నాడు.  ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరంగా కోహ్లి ఇప్పుడు తిరుగులేని స్థితిలో ఉన్నాడు. (కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..)

ప్రస్తుతం అతని వయసు 31ఏళ్లే కాబట్టి ఇంకా ఆరు సంవత్సరాలు అలవోకగా క్రికెట్‌ ఆడేస్తాడు. నా అంచనా ప్రకారం కోహ్లిలో మరో పదేళ్ల క్రికెట్‌ ఆడే సామర్థ్యం ఉంది. శారీరకంగా ఎంత ఫిట్‌గా ఉన్నాడో.. మానసికంగా అంతే ధృఢంగా ఉన్నాడు’ అని దీప్‌దాప్‌ గుప్తా తెలిపాడు.  2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లి.. 2012 నుంచి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే పూర్తిగా శాఖాహారిగా మారిపోయిన కోహ్లి.. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ప్రాధాన‍్యత ఇస్తున్నాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో 27 శతకాలు సాధించిన కోహ్లి.. వన్డేల్లో 43 సెంచరీలు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ సెంచరీల జాబితాలో కోహ్లి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.  ఇక్కడ సచిన్‌ టెండూల్కర్‌(100) తొలి స్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌(71) రెండో  స్థానంలో ఉన్నాడు. (విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్‌)

మరిన్ని వార్తలు