-

విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్

17 Jan, 2016 14:45 IST|Sakshi
విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్

మెల్ బోర్న్: ఆతిత్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్ డేలో టీడిండియా బ్యాట్స్ మన్, టెస్ట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫీట్ సాధించాడు. వన్ డేల్లో అతి వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 169 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ 161 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికన్ స్టార్ ఏ.బి. డివిలియర్స్ పేరుమీద ఉండేది.

వన్ డేల్లో తన 166వ ఇన్నింగ్స్(172వ మ్యాచ్)లో డివిలియర్స్ 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ తాజా ఇన్నింగ్స్ తో ఏబీ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు 7 వేల పరుగుల మైలురాయిని దాటిన క్రికెటర్లు 36 మంది ఉన్నారు. వన్ డేల్లో ప్రమాదకరమైన బ్యాట్స్ మన్ గా ముద్రపడ్డ 27ఏళ్ల కోహ్లీ ఇప్పటివరకు వన్ డేల్లో 23 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు కూడాసాధించాడు. వేగంగా ఏడువేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ల వివరాలిలా ఉన్నాయి..

సౌరవ్ గంగూలి(భారత్) - 174వ ఇన్నింగ్స్(180వ మ్యాచ్)
బ్రియాన్ లారా(వెస్టిండీస్)- 183వ ఇన్నింగ్స్ లో
డెస్మండ్ హెన్స్(వెస్టిండీస్) 183వ ఇన్నింగ్స్ లో
జాక్వెస్ కలిస్(దక్షిణాఫ్రికా)- 188వ ఇన్నింగ్స్
సచిన్ టెండూల్కర్(భారత్)- 189వ ఇన్నింగ్స్

మరిన్ని వార్తలు