టాప్‌ ప్లేయర్‌.. టాప్‌ కట్‌!

3 Jan, 2020 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాదిని కొత్తగా ఆరంభించాలనే ఉద్దేశంతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తాజాగా టాప్‌ కట్‌ అని పిలవబడే హెయిర్‌ కట్‌ను కోహ్లి చేయించుకున్నాడు. శ్రీలంకతో ఆదివారం నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న తరుణంలో కోహ్లి.. ఇలా తన కొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమయయాడు. హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హాకీమ్‌తో కోహ్లి టాప్‌ కట్‌ చేయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోలను హకీమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు.

దీనిపై బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ‘టెర్రిఫిక్‌’ అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు, వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న కోహ్లి.. తన టాప్‌ హెయిర్‌ కట్‌తో ఒక మంచి ఆరంభాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు విన్నూత్నమైన స్టైల్‌ను అవలంభించడం కోహ్లికి అలవాటు. ఎప్పుడూ తన లుక్‌తో కొత్తగా కనిపించే కోహ్లికి ఈ  లుక్‌ ఎంత వరకూ వర్కౌట్‌ అవుతుందో చూద్దాం. గతేడాదిని ఘనంగా ముగించిన టీమిండియా.. ఈ ఏడాదిలో శ్రీలంకపై గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది.

 

New Year ... New Cut🤘 ...The KING 👑 @virat.kohli ❤️ #viratkohli #king 🤘👑

A post shared by Aalim Hakim (@aalimhakim) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జడేజాను ఎదుర్కొవడం కష్టం: స్మిత్‌

హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా

గావస్కర్‌ విరాళం రూ. 59 లక్షలు

102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...

ప్రాణాలకంటే ఆటలు ఎక్కువ కాదు

సినిమా

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి

బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’

పదేళ్లకు మళ్లీ ఆ డైరెక్టర్‌తో మహేష్‌?