మరో శతకం సాధించిన కోహ్లి

26 Nov, 2017 12:47 IST|Sakshi

గవాస్కర్‌, రికీ పాటింగ్‌ల రికార్డులను అధిగమించిన కోహ్లి

నాగ్‌పూర్‌: అన్ని ఫార్మట్లలో కలిపి అలవోకగా 50 శతకాలు సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో శతకం సాధించాడు. శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్ట్‌ భారత తొలి ఇన్నింగ్స్‌ మూడు రోజు ఆటలో 130 బంతుల్లో 10 ఫోర్లతో కెరీర్‌లో 19వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

ఓవర్‌నైట్‌ స్కోరు 312/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన పుజారా, కోహ్లిలు లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ.. మూడో వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రెండో రోజు రెండు సెంచరీలు( మురళి విజయ్‌, పుజారా) నమోదుకాగా మూడో రోజు మూడో సెంచరీ నమోదు కావడం విశేషం.

కెప్టెన్‌గా కోహ్లి రికార్డు
ఈ సెంచరీతో కెప్టెన్‌గా రికీ పాంటింగ్‌, సునీల్ గ‌వాస్కర్‌ల పేరిట ఉన్న రికార్డుల‌ను కోహ్లి అధిగమించాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ప‌ది సెంచ‌రీల‌తో పాంటింగ్ రికార్డు బ‌ద్దలు కొట్టగా.. భారత కెప్టెన్‌గా 12వ సెంచ‌రీతో గ‌వాస్కర్‌ను వెన‌క్కి నెట్టాడు. గతంలో ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో ప్రథమ స్థానంలో నిలువగా.. ఇప్పుడు దాన్ని కోహ్లీ అధిగమించాడు. ఈ సెంచరీతో టెస్టు కెరీర్‌లో ఇండియా కెప్టెన్‌గా కోహ్లీ 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా