మైదానంలో కోహ్లి ఫన్నీ డ్యాన్స్‌.. వైరల్‌ వీడియో

8 Dec, 2018 12:37 IST|Sakshi

అడిలైడ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఉన్నప్పుడు తనను తానే మర్చిపోతాడనడానికి ఇదొక ఉదాహరణ. సాధారణంగా బ్యాట్‌తో ఆకట్టుకున్నప్పుడో, బౌలర్లు వికెట్లు తీసినప్పుడో కోహ్లి ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటాడు. అయితే తాజాగా మైదానంలో డ్యాన్స్‌ చేస్తూ కోహ్లి అభిమానుల్ని అలరించాడు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆట ప్రారంభించడానికి ముందు వర్షం పడింది. దీంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గిన తర్వాత అందరూ తిరిగి మైదానంలోకి చేరుకున్నారు. ఆట ప్రారంభం కాబోతుండగా కోహ్లి ఓ చోట నిలబడి డ్యాన్స్‌ చేశాడు. ఈ వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ట్విటర్‌లో పంచుకుంది. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు