ఆడుతూ... పాడుతూ...

17 Oct, 2016 06:19 IST|Sakshi
ఆడుతూ... పాడుతూ...

తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
6 వికెట్లతో న్యూజిలాండ్ చిత్తు
కోహ్లి అర్ధసెంచరీ, రాణించిన పాండ్యా
గురువారం రెండో మ్యాచ్  

 

ఫార్మాట్ మారినా భా రత జోరులో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. టెస్టుల్లో ఘన విజయాల తర్వాత రంగు దుస్తుల్లోనూ మన టీమ్ మెరిసింది. అక్కడ సారథిగా ముందుండి నడిపించిన కోహ్లి, ఇక్కడ అలవాటైన రీతిలో ఆటగాడిగా మరో చూడచక్కటి ఇన్నింగ్‌‌స ఆడాడు. అంతకుముందు మన బౌలర్లు కూడా అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా వన్డే సిరీస్‌ను ఏకపక్ష గెలుపుతో ప్రారంభించిన టీమిండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.     

 

 తొలి మ్యాచ్ ఆడుతున్న హార్దిక్ పాండ్యాకుతోడు ఉమేశ్, అమిత్ మిశ్రా దెబ్బకు కివీస్ విలవిల్లాడింది. చివరకు పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్‌కు కూడా వికెట్లు ఇచ్చేయడంతో ఒక దశలో న్యూజిలాండ్ ఇన్నింగ్‌‌స 100లోపే ముగిసేలా అనిపించింది. అరుుతే లాథమ్, సౌతీ కాస్త పోరాడటంతో ఆ జట్టు పరువు నిలిచింది. అరుుతే తుది స్కోరు మాత్రం భారత్‌ను నిలువరించేందుకు సరిపోలేదు. ఛేదనలో మేటి అరుున విరాట్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా మారిపోరుుంది. 

 

ధర్మశాల:  సొంతగడ్డ మీద ప్రత్యర్థి న్యూజిలాండ్‌పై భారత్ అప్రతిహత విజయాలు కొనసాగుతున్నారుు. టెస్టుల్లో కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన మన జట్టు ఇప్పుడు వన్డేల్లోనూ శుభారంభం చేసింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా మరో 101 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌటైంది. టామ్ లాథమ్ (98 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్స్), టిమ్ సౌతీ (45 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (3/31), అమిత్ మిశ్రా (3/49) కివీస్‌ను దెబ్బ తీశారు. అనంతరం భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (81 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో చివరి వరకు నిలిచాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఈ నెల 20న న్యూఢిల్లీలో జరుగుతుంది. 

 
టపటపా...

భారత్ తరఫున 16 టి20 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. పిచ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో మన పేసర్లు ఆరంభంలోనే పట్టు బిగించారు. తన తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదిన గప్టిల్ (12)ను అదే ఓవర్ చివరి బంతికి అవుట్ చేసి పాండ్యా కెరీర్‌లో మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత ఉమేశ్ ధాటికి కివీస్ కష్టాల్లో పడింది. తన వరుస ఓవర్లలో అతను విలియమ్సన్ (3), టేలర్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా, మరో ఎండ్‌లో లాథమ్ పట్టుదలగా నిలబడ్డాడు. అరుుతే పాండ్యా రెండు వికెట్లతో మరోసారి న్యూజిలాండ్‌ను దెబ్బ తీశాడు. మిడాఫ్‌లో ఉమేశ్ అద్భుత క్యాచ్‌కు అండర్సన్ (4) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రోంచీ (0) కూడా ఉమేశ్‌కే క్యాచ్ ఇచ్చాడు. పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ వరుస బంతుల్లో నీషమ్ (10), సాన్‌ట్నర్ (0)లను అవుట్ చేయడంతో కివీస్ స్కోరు 19 ఓవర్లకే 65/7 వద్ద నిలిచింది.


ఆదుకున్న లాథమ్, సౌతీ...
ఈ దశలో లాథమ్ పట్టుదల ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడాడు. అతనికి కొద్ది సేపు బ్రేస్‌వెల్ (15) అండగా నిలిచాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో 77 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ పూర్తరుుంది. మిశ్రా ఈ జోడీని విడదీసిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సౌతీ దూకుడుగా ఆడాడు. 2 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉమేశ్ వదిలేయడం సౌతీకి కలిసొచ్చింది. అదే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను పటేల్, మిశ్రా ఓవర్లలో చెరో సిక్సర్ బాదాడు. ఉమేశ్ ఓవర్లో కూడా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన సౌతీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 100వ వన్డే ఆడుతున్న అతని కెరీర్ లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. ఎట్టకేలకు చక్కటి బంతితో సౌతీని వెనక్కి పంపి మిశ్రా తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి తెర దిం చాడు. లాథమ్, సౌతీ 58 బంతుల్లోనే 71 పరుగులు జోడించడం విశేషం. సోధి (1)ని కూడా మిశ్రా అవుట్ చేయడంతో 37 బంతులు మిగిలి ఉండగానే కివీస్ ఇన్నింగ్‌‌స ముగిసింది. ఓపెనర్‌గా వచ్చిన చివరి వరకు నాటౌట్‌గా ఉన్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా లాథమ్ నిలిచాడు.


అలవోకగా ఛేదన...
సాధారణ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రహానే (34 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (14) శుభారంభం ఇచ్చారు. రోహిత్ నెమ్మదిగా ఆడినా, బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో రహానే దూకుడు ప్రదర్శించాడు. అరుుతే పదో ఓవర్లో రోహిత్ అవుట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోరుుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే రహానే కూడా వెనుదిరగ్గా, మనీశ్ పాండే (17) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరో ఎండ్‌లో కోహ్లి ప్రశాంతంగా తన పని చేసుకుంటూ పోయాడు. ఎక్కడా ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా ఆడిన అతను, తనదైన శైలిలో అలవోకగా పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ధోని (21)నుంచి అతనికి మద్దతు లభించింది. ఇదే జోరులో 55 బంతుల్లోనే తన కెరీర్‌లో 37వ అర్ధ సెంచరీని అందుకున్నాడు. తన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం కోహ్లి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సౌతీ అందుకోవడంలో విఫలం కాగా... మరుసటి ఓవర్లోనే ధోని రనౌటయ్యాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో ధోని ముందుకొచ్చి షాట్ ఆడాడు. బంతి అతని కాలికి తగిలి ఫీల్డర్ వైపు వెల్లింది. అరుుతే సింగిల్ తీయడంలో కోహ్లి సందేహించడంతో ధోని వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోరుుంది. ఆ తర్వాతా తన ధాటిని కొనసాగించిన కోహ్లి 34వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

 

చాంపియన్‌‌స ట్రోఫీకి ముందు మేం ఎనిమిది మ్యాచ్‌లు మాత్రమే ఆడబోతున్నాం. కాబట్టి పరిస్థితులను బట్టి బౌలర్లు ఎలా ఆడగలరో పరీక్షించేందుకు పాండ్యాకు అవకాశం ఇచ్చాం. కొత్త బంతిని సమర్థంగా ఉపయోగిస్తే ముగ్గురు ప్రధాన పేసర్లలో ఒకడిగా అతనికి తప్పక చోటు ఉంటుంది. కొంత మంది ఇతర బౌలర్లతో పోలిస్తే పాండ్యా ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి స్వింగ్ రాబట్టగలడు. ఉమేశ్‌లో కూడా నిలకడ పెరగడం మంచి పరిణామం. ఇంగ్లండ్ పిచ్‌లు అతనికి బాగా అనుకూలిస్తారుు. అవసరం ఉన్న సమయంలో ప్రత్యామ్నాయంగా పనికి రావాలంటే ప్రాక్టీస్ ఉండాలనే పార్ట్ టైమర్లతో బౌలింగ్ చేరుుంచా.

 -ధోని, భారత కెప్టెన్

మరిన్ని వార్తలు