'విరాట్ను ఎవరూ ఆపలేరు'

7 Jun, 2016 17:59 IST|Sakshi
'విరాట్ను ఎవరూ ఆపలేరు'

కోల్కతా: ప్రస్తుతం అసాధారణ ఫామ్లో ఉన్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లినీ నియంత్రిచడం ఎవరికీ సాధ్యం కాదని శ్రీలంక మాజీ ఆటగాడు, టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. గత రెండు సంవత్సరాల నుంచి అత్యుద్భుత ఫామ్ను కొనసాగిస్తున్న విరాట్ చాలాకాలం ఇదే ఊపును కొనసాగించే అవకాశం ఉందని మురళీ పేర్కొన్నాడు.

 

ఒక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోనే కాదు, అంతర్జాతీయ క్రికెట్లో కూడా  తనదైన ముద్రతో కొనసాగిస్తూ దూసుకుపోతున్న విరాట్ను నిలువరించడం అంత సులభతరం కాదన్నాడు.ప్రస్తుతం విరాట్ తన కలను సాకారం చేసుకునే క్రమంలో మధ్యలో మాత్రమే ఉన్నాడని, ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించి మరిన్ని రికార్డులు నెలకొల్పుతాడని ఆశిస్తున్నట్లు మురళీధరన్ తెలిపాడు. యువ క్రికెటర్లను సానబట్టేందుకు క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(క్యాబ్) రూపొందించిన ' విజన్ 2020' కార్యక్రమానికి హాజరైన మురళీ ధరన్.. విరాట్ను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రపంచంలోని విరాట్ అత్యుత్తమ బ్యాట్స్మన్ అని కొనియాడాడు.

>
మరిన్ని వార్తలు