రస‘పట్టులో’...

17 Dec, 2018 02:36 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 132/4

ఇప్పటికి 175 పరుగుల ఆధిక్యం

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 283

విరాట్‌ కోహ్లి అద్భుత శతకం

ఆధిపత్యం అటుఇటు చేతులు మారుతూ రెండో టెస్టు రసపట్టుకు చేరింది. ఇరుజట్లు పైచేయికి ప్రయత్నిస్తుండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. కోహ్లి అద్భుత శతకం ఆదివారం ఆటలో హైలైట్‌ కాగా... ఫలితం ఎవరివైపో తేలేందుకు నాలుగో రోజు తొలి సెషన్‌ కీలకం కానుంది. వరుసగా రెండో టెస్టును కైవసం చేసుకునేందుకు టీమిండియా బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌పై బాధ్యత సమంగా ఉంది.  

పెర్త్‌: అటు ఆస్ట్రేలియా, ఇటు టీమిండియా దేనికదే పోరాడుతుండటంతో పెర్త్‌ టెస్టు ఫలితం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగుల ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా... ఆదివారం ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 132/4తో నిలిచింది. భారత బౌలర్లు వరుస విరామాల్లో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖాజా (41 బ్యాటింగ్‌; 5 ఫోర్లు), కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (8 బ్యాటింగ్‌; 1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు. ఆ జట్టు ఓవరాల్‌ ఆధిక్యం 175కు చేరింది. రెండు రోజుల ఆట ఉన్న నేపథ్యంలో కంగారూల మిగతా వికెట్లను ఎంత తొందరగా పడగొడితే మన జట్టుకు అంత ప్రయోజనం. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 172/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమిండియా  283 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌ కోహ్లి (123; 13 ఫోర్లు, 1 సిక్స్‌) అద్వితీయ శతకానికితోడు హనుమ విహారి (20), రిషభ్‌ పంత్‌ (36) ఉపయుక్తమైన స్కోర్లు చేశారు. లయన్‌ (5/67) మరోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు.తనకే సాధ్యమైన ఆటతో విరాట్‌ కోహ్లి మరోసారి అందరి మన్ననలు చూరగొన్నాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 82తో ఆదివారం బ్యాటింగ్‌కు దిగిన అతడు ముచ్చటైన కవర్‌ డ్రైవ్‌లతో పరుగులు రాబట్టాడు. రహానే తొలుతే ఔటవడంతో... తన వికెట్‌ విలువ గుర్తుంచుకుంటూ ఒక్కో పరుగూ జోడిస్తూ వెళ్లాడు. మ్యాచ్‌ ప్రారంభమైన 11వ ఓవర్‌ తర్వాత కాని అతడు బౌండరీ కొట్టలేదంటే ఎంత ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్‌ పేసర్ల పదునైన బంతులకు తట్టుకుని విహారి నిలిచాడన్న భరోసా కలిగాక కోహ్లి జోరుపెంచి 25వ టెస్టు సెంచరీ సాధించాడు.  

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 326; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) హాజల్‌వుడ్‌ 2; విజయ్‌ (బి) స్టార్క్‌ 0; పుజారా (సి) పైన్‌ (బి) స్టార్క్‌ 24; కోహ్లి (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) కమిన్స్‌ 123; రహానే (సి) పైన్‌ (బి) లయన్‌ 51; విహారి (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 20; పంత్‌ (సి) స్టార్క్‌ (బి) లయన్‌ 36; షమీ (సి) పైన్‌ (బి) లయన్‌ 0; ఇషాంత్‌ (సి అండ్‌ బి) లయన్‌ 1; ఉమేశ్‌ (నాటౌట్‌) 4; బుమ్రా (సి) ఖాజా (బి) లయన్‌ 4; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (105.5 ఓవర్లలో ఆలౌట్‌) 283.  వికెట్ల పతనం: 1–6, 2–8, 3–82, 4–173, 5–223, 6–251, 7–252, 8–254, 9–279, 10–283. బౌలింగ్‌: స్టార్క్‌ 24–4–79–2; హాజల్‌వుడ్‌ 21–8–66–2; కమిన్స్‌ 26–4–60–0; లయన్‌ 34.5–7–67–5. 

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: హారిస్‌ (బి) బుమ్రా 20; ఫించ్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 25; ఖాజా (బ్యాటింగ్‌) 41; షాన్‌ మార్‌‡్ష (సి) పంత్‌ (బి) షమీ 5; హ్యాండ్స్‌కోంబ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఇషాంత్‌ 13; హెడ్‌ (సి) ఇషాంత్‌ (బి) షమీ 19; పైన్‌ (బ్యాటింగ్‌) 8; 
ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (48 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 132 
వికెట్ల పతనం: 1–59, 2–64, 3–85, 4–120. బౌలింగ్‌: ఇషాంత్‌ 9–0–33–1; బుమ్రా 13–5–25–1; షమీ 10–3–23–2; ఉమేశ్‌ 8–0–39–0; విహారి 8–4–11–0.  

మరిన్ని వార్తలు