అంతిమంగా మిగిలేది ప్రేమే: కోహ్లి

27 Nov, 2019 17:51 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇటీవలే 31వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 5వ తేదీన కోహ్లి తన భార్య, బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్కశర్మతో కలిసి భూటాన్‌లో పుట్టినరోజును వేడుకలను జరుపుకున్నారు. తాజాగా తన భార్య అనుష్కతో కలిసిన దిగిన కొన్ని ఫోటోలను విరాట్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోన్నారు. ప్రసుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన భార్య అనుష్క గురించి విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ అనుష్కతో జీవితాన్ని ఆస్వాధిస్తున్నానని అంతిమంగా తామిద్దరి మద్య మిగిలేది ప్రేమేనంటూ చెప్పుకొచ్చాడు.


ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంతోషక్షణాల్ని పంచుకోవడంలో విరాట్‌ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. తనకు నచ్చిన పర్యాటక ప్రదేశం భూటాన్‌లో ఇద్దరు చెట్టాపట్టాలేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఒకరు క్రికెట్‌లో అదరగొడుతుంటే మరొకరు సినిమాలలో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటుతుండడం విశేషం.

Walking together in the journey of life with nothing But love❤️ @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు