మెరుగైన ఫలితాల కోసం​ కష్టపడాలి: కోహ్లి

29 Jan, 2020 17:51 IST|Sakshi

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి యువతకు ప్రేరణ కలిగించే అంశాలను సోషల్‌ మీడియాలో తరుచుగా పోస్ట్‌ చేస్తుంటాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లలో అద్భుత ఫోమ్‌ను కొనసాగిస్తున్న విరాట్‌ తాజాగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్‌ చేశాడు. ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌ చేస్తున్న దృష్యాలను ఫోస్ట్‌ చేశాడు. ఏ పని చేసినా ఏదో కష్టపడాలని కాకుండా మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లిని ఆదర్శంగా తీసుకొని మహ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌ సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌లో తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తుంది.

Putting in the work shouldn't be a choice, it should be a requirement to get better. #keeppushingyourself

A post shared by Virat Kohli (@virat.kohli) on

ఈ మధ్య కాలంలో టీమిండియా ఆటగాళ్లు మెరుగైన ఫిట్‌నెస్‌ను సాధించారని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ స్పందిస్తూ..ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగు పరిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు.  ఆటగాళ్లు సిక్సులను సులభంగా  బాదుతున్నారని కొనియాడారు.

చదవండి: కోహ్లికి నాకు కొన్ని పోలికలు నిజమే: బాలీవుడ్ నటి

మరిన్ని వార్తలు