ధోనిని చూసే కెప్టెన్సీ నేర్చుకున్నా: కోహ్లి

25 Sep, 2018 15:42 IST|Sakshi
విరాట్‌ కోహ్లి, ధోని (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని నుంచే నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు. ఓ ఇంట్వర్వూలో మాట్లాడుతూ.. ‘ఎంఎస్‌ ధోని నుంచే నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నాను. నా కెరీర్‌ ప్రారంభం నుంచి ధోనితో ఎప్పుడూ ఆట గురించే మాట్లాడుతుంటాను. నేను వైస్‌ కెప్టెన్‌ కాకముందే అతనితో నా సలహాలు సూచనలు పంచుకునేవాడిని. నాకు ఆట గురించి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. అందుకే కెప్టెన్సీని  ఎంతో ఆస్వాదిస్తాను. ఆటలో చేజింగ్‌ అంటే ఇష్టపడతాను. ఆట జరుగుతున్నంత సేపు నా మెదడుకు పనిపెడుతూనే ఉంటాను.

ధోని నుంచి ఎంతో నేర్చుకున్నాను. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు దగ్గరగా అతని ఆటతీరును పరిశీలించేవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఇక ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు.. కోహ్లికి వికెట్ల వెనక ఉండి తనవంతు సహకారం అందిస్తానని తెలిపిన విషయం తెలిసిందే. అన్నమాట ప్రకారమే ధోని ఓ సీనియర్‌గా తన సలహాలు, సూచనలందిస్తూ కోహ్లి అండగా నిలుస్తున్నాడు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో తాత్కలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం ధోని సలహాలు, సూచనలతోనే విజయాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు