టీనేజ్‌ను షేర్‌ చేసుకున్న కోహ్లి..!

20 Sep, 2019 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: తన సంతోషాన్ని అభిమానులతో షేర్‌ చేసుకోవడంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ ​కోహ్లి ఎ‍ప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాల్ని పంచుకున్న కోహ్లి.. తాజాగా మరో మధురస్మృతిని గుర్తు చేసుకున్నాడు. కోహ్లి యవ్వనంలో ఉన్నప్పటి  ఫొటోను ఒకటి తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌  చేశాడు.  అతని టీనేజ్‌ వయసుకు సంబంధించిన ఫొటోలో కోహ్లి ఫిట్‌గా, క్యాజువల్‌ టీ షర్ట్‌లో ఉన్నాడు. ‘ ఇది నేను యువకుడిగా ఉన్నప్పటి ఫొటో. నా 16 ఏళ్ల వయసుకు వెళితే ఇలా ఉన్నా’ అని ట్వీట్‌ చేశాడు.  అయితే ఒక కోహ్లిని మరొక కోహ్లి చూస్తున్నట్లు ఉన్న ఫొటోపై అభిమానులు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు.

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన రెండో టీ20లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి అజేయంగా 72 పరుగులు సాధించి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి దూకుడుగా ఆడాడు. అవలీలగా పరుగులు సాధించి దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలోనే 22వ అంతర్జాతీయ టీ20 హాఫ్‌ సెంచరీ సాధించి ఈ జాబితాలో టాప్‌కు చేరాడు. ఇక్కడ 21 హాఫ్‌ సెంచరీలతో ఉన్న రోహిత్‌ శర్మను కోహ్లి అధిగమించాడు. మరొకవైపు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.  ఇప్పటివరకూ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో కోహ్లి సాధించిన పరుగులు 2,441.ఇక్కడ కూడా రోహిత్‌ శర్మ రికార్డునే కోహ్లి సవరించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా