విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్లాన్ ఇదే!

4 Nov, 2017 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ:తన క్రికెట్ కెరీర్ లో రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటించాలనే దానిపై భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. ఆదివారం(నవంబర్ 5) తన 29వ పుట్టినరోజు జరుపుకోనున్న కోహ్లి.. కెరీర్ కు సంబంధించిన విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు వెబ్ టాక్ షో 'బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్' కార్యక్రమంలో తన రిటైర్మెంట్ పై  కోహ్లి స్పష్టతనిచ్చాడు.

'గెలుపొందడమే నాకు స్ఫూర్తి. ఆటపై ఆసక్తి తగ్గిపోయిన మరుక్షణమే క్రికెట్ ఆడటం ఆపేస్తా. నా శరీరం సహకరించిన అన్ని రోజులు ఆటన ఆస్వాదిస్తా. ఇక ఆడలేను అనుకున్న తరుణంలో వీడ్కోలు చెప్పేస్తా. ఆటపై ఇష్టం లేకుండా లేచిన రోజులు చాలా ఉన్నాయి. పట్టుదలగా ఆడి దాన్ని అధిగమించా. మనకు వెన్నుతట్టి ప్రోత్సహించే వారుంటే అపజయాల భారం తగ్గుతుంది. క్రీడాకారులు ఇది చాలా అవసరం. ఆట ఉత్కంఠగా ఉన్నప్పుడు ఇష్టం లేకుండా బరిలోకి దిగాల్సి వస్తే ఆ రోజు క్రికెట్ కు గుడ్ బై చెబుతా'అని వరుస రికార్డులతో దుమ్మురేపుతున్న కోహ్లి తెలిపాడు.

మరిన్ని వార్తలు