వెయ్యి పరుగులు పూర్తి చేసిన కోహ్లి

7 Jul, 2019 09:56 IST|Sakshi

లీడ్స్‌ :  టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఐదు పరుగుల వద్ద ఉండగా ఈ ఘనతను అందుకున్నాడు. 25 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా విరాట్‌ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే ఈ  జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (44 ఇన్నింగ్స్‌ల్లో 2278 )పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, సౌరవ్‌ గంగూలీ( 21 ఇన్నింగ్స్‌ల్లో 1006) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ టీమిండియా తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగుల రికార్డు సాధించేందుకు 23పరుగుల దూరంలో నిలిచాడు.ఇప్పటివరకు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ 16 ఇన్నింగ్స్‌ల్లో 977 పరుగులు నమోదు చేశాడు. జూలై 9న జరగనున్న మొదటి సెమీఫైనల్లో టీమిండియా  న్యూజీలాండ్‌తో తలపడనుంది.

మరిన్ని వార్తలు