నా కల నిజమైంది: కోహ్లి

4 Aug, 2016 16:41 IST|Sakshi

కింగ్ స్టన్(జమైకా):విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్రతో దూసుకుపోతున్న టీమిండియా క్రికెటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి తన బాల్యంలో భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ను చూస్తే చాలనుకునే వాడట.  అయితే ఆ క్రమంలోనే దాదాపు దశాబ్దం క్రితం ద్రవిడ్ను కలిసే అవకాశం వచ్చింది.  అది తన జీవితంలో అరుదైన అవకాశంగా భావించిన కోహ్లి.. ద్రవిడ్ను అలానే చూస్తుండిపోయాడు. ఆనాటి ఫోటోలో మిగతా వారంతా  ఫోజులిస్తుంటే, కోహ్లి మాత్రం ద్రవిడ్నే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కాగా, అది పది సంవత్సరాల క్రితం మాట.

ఇప్పుడు కోహ్లి కూడా అత్యుత్తమ క్రికెటర్లలో ఒకటిగా గుర్తింపు సాధించాడు. ఎన్నో పర్యటనలు, మరెన్నో ఇంటర్య్వూలు. విరాట్ ఇప్పటివరకూ ఇంటర్య్వూలో ఇచ్చిన వారిలో ఎంతోమంది జర్నలిస్టులుండగా,  పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. కాగా, కోహ్లిని ద్రవిడ్ ఇంటర్య్వూ చేసే అవకాశం మాత్రం వెస్టిండీస్తో రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా వచ్చింది. ఆ టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లిని ద్రవిడ్ ఇంటర్య్వూ చేశాడు. ఈ సందర్భంగా ద్రవిడ్ తో ఎన్నో విషయాలను షేర్ చేసుకున్న కోహ్లి..  తాజాగా తన కల నిజమైందంటూ ట్వీట్ చేశాడు. ఆనాటి, ఒకనాటి ద్రవిడ్తో కలిసి దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు.  ఇది తన జీవితంలో ఒక అరుదైన జ్ఞాపకమని విరాట్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు