'ధోనికి కోహ్లి మద్దతు అద్భుతం'

17 Nov, 2017 16:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. సహచర ఆటగాడు, అనుభవజ్ఞుడైన ఎంఎస్ ధోనికి కోహ్లి మద్దతుగా నిలవడం అత్యంత చెప్పుకోదగిన విషయమంటూ కొనియాడాడు.

'కోహ్లి అద్భుతమైన కెప్టెన్. డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లి ఏం చేస్తాడో నాకు తెలీదు. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తాడో కూడా తెలియదు. నేను జట్టుకు చాలా దూరంగా ఉన్నా. జట్టు సమావేశాల్లో విరాట్ ఏం మాట్లాడతాడనే విషయమూ నాకు తెలీదు. కానీ ఆటగాళ్లతో అతడు వ్యవహించే తీరు నిజంగా అనిర్వచనీయం'అని గంగూలీ పేర్కొన్నాడు. ప్రధానంగా ధోని విషయంలో విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు చాలా అద్భుతంగా ఉందన్నాడు. కెరీర్ చరమాంకలో ఉన్న చాంపియన్ ఆటగాడు ధోని జట్టులో ఉండాలనేది కోహ్లి గట్టి కోరికగా పేర్కొన్న గంగూలీ.. ఇది మహిపై ఎంతో ప్రభావం చూపడమే కాకుండా అతను తిరిగి పూర్తిస్థాయిలో ఆడటానికి ఉపయోగపడుతుందన్నాడు.


మరిన్ని వార్తలు