ఆ అరుదైన రికార్డుకు 14 ఏళ్లు పూర్తి

29 Mar, 2018 09:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా ఆటగాడు, ‘డ్యాషింగ్‌’ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఇవాళ చాలా స్పెషల్‌ డే. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో భారత్‌ తరపున తొలి ట్రిపుల్‌ సాధించిన ఆటగాడు వీరూనే. ఆ అరుదైన రికార్డుకు నేటితో సరిగ్గా 14 ఏళ్లు పూర్తయ్యింది. 

పాకిస్థాన్‌ టూర్‌ సందర్భంగా 2004లో ముల్తాన్‌ టెస్ట్‌ లో సెహ్వాగ్‌ ఈ ఘనతను కైవసం చేసుకున్నారు. మొత్తం 531 నిమిషాలు క్రీజ్‌లో ఉన్న వీరూ.. 375 బంతులెదుర్కుని 309 పరుగులు సాధించారు. అందులో 39 ఫోర్‌లు, 6 సిక్సర్లు ఉన్నాయి. షోయబ్‌ అక్తర్‌, సక్లైన్‌ ముస్తాక్‌, సమీ, రజాక్‌ వేసిన బంతులను చితకబాదుతూ మైదానంలో వీరూ విశ్వరూపం ప్రదర్శించారు. 

ఇక అరుదైన ఈ రికార్డును ఐసీసీ గుర్తు చేస్తూ ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మళ్లీ చెన్నైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో 319 పరుగులు చేసి రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. చివరిసారిగా భారత్‌ తరపున యువ బ్యాట్స్‌మన్‌ కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. 2016లో నాయర్‌ ఇంగ్లాండ్‌పై చెన్నైలో జరిగిన టెస్టులో 303 పరుగులు సాధించాడు.  

మరిన్ని వార్తలు