అండర్సన్ కు సెహ్వాగ్ చురకలు!

12 Dec, 2016 14:51 IST|Sakshi
అండర్సన్ కు సెహ్వాగ్ చురకలు!

విశాఖ: భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్లో చమత్కారం స్థాయి చాలా ఎక్కువ. ఈ విషయం అతను క్రికెట్ నుంచి రిటైరైన తరువాతే మనకు బోధ పడింది. ఇటీవల కాలంలో ట్విట్టర్ వేదికగా  వీరూ తన చమత్కరాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. అయితే ఈసారి మన ట్విట్టర్ కింగ్.. కింగ్ పెయిర్(తొలి బంతికే డకౌట్)  అస్త్రాన్ని అండర్సన్పై ప్రయోగించాడు. దానికి కారణం భారత్ తో రెండో టెస్టులో అండర్సన్ రెండు ఇన్నింగ్స్ల్లో మొదటి బంతికే డకౌట్గా పెవిలియన్ చేరడమే.

'గతంలో నేను కింగ్ పెయిర్ కావడానికి నువ్వు కారణమయ్యావు. ఇప్పుడు నువ్వు అలానే అయ్యావు. లెక్క సరిపోయినట్లుంది' అని సెహ్వాగ్ చురకలంటించాడు. ఈ సందర్భంగా భారతదేశ గణితశాస్త్ర అగ్రగణ్యుడు ఆర్యభట్టను సెహ్వాగ్ ఉదహరించాడు. ప్రధానంగా  '౦' ను ఆర్యభట్ట కనిపెట్టడమే సెహ్వాగ్ ఉద్దేశం కావొచ్చు.

 

2011లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా  సెహ్వాగ్  తొలి ఇన్నింగ్స్ లో తొలి బంతికే బ్రాడ్ బౌలింగ్ లో అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో అండర్సన్ బౌలింగ్ లో మొదటి బంతికి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు భారత్ తో రెండో టెస్టు సందర్భంగా అండర్సన్ రెండు ఇన్నింగ్స్ ల్లో తొలి బంతికే నిష్ర్కమించడంతో సెహ్వాగ్ తన సృజనకు పదునుపెట్టి మరీ చమత్కరించాడు. ఒకవేళ బ్రాడ్ తొలి బంతికే అయ్యుంటే అతన్ని కూడా సెహ్వాగ్ టార్గెట్ చేసేవాడేమో!

మరిన్ని వార్తలు