విజేతలు విష్ణు, దియా

5 Aug, 2019 10:06 IST|Sakshi

ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఐఎస్‌సీఈ ఏపీ, తెలంగాణ రీజినల్‌ ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బి. విష్ణు (గీతాంజలి స్కూల్‌), దియా ఎన్‌ వోరా (నాసర్‌ స్కూల్‌) ఆకట్టుకున్నారు. సెయింట్‌ జార్జ్‌ గ్రామర్‌ స్కూల్‌ (ఆబిడ్స్‌) ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–19 బాలబాలికల సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ చాంపియన్‌లుగా నిలిచి టైటిళ్లను అందుకున్నారు. యశ్‌పాల్‌ రాజ్‌ పురోహిత్‌ (ఫ్యూచర్‌కిడ్స్, రాజమండ్రి) రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకోగా... హృదయ్‌ షా (గీతాంజలి, బేగంపేట్‌) మూడోస్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో అషితా అగర్వాల్‌ (గీతాంజలి), ఉరినా ఖాన్‌ (నాసర్‌ స్కూల్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.

టీమ్‌ విభాగంలో గీతాంజలి స్కూల్‌ (బేగంపేట్‌) జట్లు బాలబాలికల విభాగంలో చాంపియన్‌లుగా నిలిచాయి. అండర్‌–17 బాలుర సింగిల్స్‌లో కె. వరుణ్‌ (జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌), యజ్ఞేశ్‌ (సెయింట్‌ జోసెఫ్‌), అర్జున్‌ (ఫ్యూచర్‌కిడ్స్‌)... బాలికల కేటగిరీలో నిషా గణేశ్‌ (హెచ్‌పీఎస్, బేగంపేట్‌), లెహర్‌ అగర్వాల్‌ (నాసర్‌ స్కూల్‌), అమూల్య (గీతాంజలి)... అండర్‌–14 బాలుర సింగిల్స్‌లో ఒమర్‌ మంజూర్‌ (నాసర్‌ స్కూల్‌), ఆదిత్య (సెయింట్‌ జోసెఫ్‌), సోహమ్‌ (ఫ్యూచర్‌ కిడ్స్‌).... బాలికల విభాగంలో దిత్య (గీతాంజలి), నష్రా షేక్‌ (నాసర్‌ స్కూల్‌), అమ్తుల్‌ నూర్‌ (నాసర్‌ స్కూల్‌) వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్‌– 14 బాలుర టీమ్‌ చాంపియన్‌షిప్‌ను గీతాంజలి స్కూల్‌... బాలికల టీమ్‌ టైటిల్‌ను నాసర్‌ స్కూల్‌ (ఖైరతాబాద్‌) గెలుచుకున్నాయి. అండర్‌–17 టీమ్‌ చాంపియన్‌షిప్‌ను హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌ (బాలుర), నాసర్‌ స్కూల్‌ (బాలికల) జట్లు సాధిం చాయి. బహుమతి ప్రదాన కార్యక్రమంలో మెదక్‌ చర్చి బిషప్‌ సోలోమన్‌ రాజ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

మరిన్ని వార్తలు