రంగ్‌దే తిరంగా...

29 Mar, 2018 10:54 IST|Sakshi
విష్ణువర్ధన్‌, మల్లీశ్వరి

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు రాణించాలని మల్లీశ్వరి, విష్ణువర్ధన్‌ ఆకాంక్ష

హైదరాబాద్‌: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి ఒలింపిక్‌ కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి, టెన్నిస్‌ ఆటగాడు విష్ణువర్ధన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘రంగ్‌దే తిరంగా’ పేరిట సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ (ఎస్‌పీఎన్‌), తెలంగాణ క్రీడా జర్నలిస్టుల సంఘం (టీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ... కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారులు ఈసారి 5 నుంచి 6 పతకాలు గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అద్వితీయ విజయాలతో చరిత్ర సష్టించాలని ఆమె ఆకాంక్షించారు. అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన భారత బందం మరిన్ని పతకాలు తెస్తుందని 2010 ఆసియా క్రీడల టెన్నిస్‌ డబుల్స్‌ కాంస్య పతక విజేత అయిన విష్ణువర్ధన్‌ అన్నారు. ఎస్‌పీఎన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కేదార్‌ తేని మాట్లాడుతూ రంగ్‌దే తిరంగా... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆటగాళ్లకు నైతిక మద్దతుగా నిలిచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్‌ ప్రింట్‌ చేపట్టిన క్యాంపెయిన్‌లో పలు రంగులతో కూడిన చేతి ముద్రలు వేసి సంఘీభావం తెలిపారు.

 

>
మరిన్ని వార్తలు