కోహ్లికి జూనియర్ రిచర్డ్స్ కానుక

26 Jul, 2016 23:54 IST|Sakshi
కోహ్లికి జూనియర్ రిచర్డ్స్ కానుక

అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్య కానుక అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను ఇదివరకే విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ప్రశంసించగా ఇప్పుడు రిచర్డ్స్ తనయుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే ఊరికే ప్రశంసలతోనే కాకుండా తన చిత్రకళానైపుణ్యాన్ని జోడించి కోహ్లి బ్యాట్ పెకైత్తి అభివాదం చేస్తున్న చిత్రాన్ని అతడు కానుకగా అందించాడు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాలి రిచర్డ్స్ నేరుగా హోటల్ గదికి వెళ్లి మరీ ఈ పెయింటింగ్‌ను అందించాడు.

‘కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించినందుకు గుర్తుగా కోహ్లికి ఏదైనా ఇద్దామనుకున్నాం. అంతే ఒకే రోజులో ఈ చిత్రాన్ని నా స్నేహితుడి సహకారంతో చిత్రించాను’ అని మాలి తెలిపాడు.

మరిన్ని వార్తలు