కీలక వన్డేకు వైజాగ్ సిద్ధం

28 Oct, 2016 08:57 IST|Sakshi
కీలక వన్డేకు వైజాగ్ సిద్ధం

తుపాను ప్రమాదం లేనట్లే  నగరానికి చేరుకున్న జట్లు 


విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణరుుంచే ఆఖరి వన్డేకు ఆతిథ్యమిచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది. తుపాను నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు తొలగిపోయారుు. తుపాను బలహీనపడటం వల్ల నగరానికి భారీ వర్షాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వర్గాలలో ఉత్సాహం పెరిగింది. ధోని సారథ్యంలోని భారత జట్టు, విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ బృందం గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారుు. శుక్రవారం ఉదయం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారుు. పిచ్‌పై ఇంకా కవర్లు తొలగించలేదు. ఒకవేళ మ్యాచ్ రోజు వర్షం పడ్డా... స్టేడియంలో ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. దీనికి తోడు సూపర్ సాపర్స్ కూడా సిద్ధం చేశారు.

కాబట్టి వాతావరణంలో ఏవైనా అనుకోని మార్పులు జరిగితే తప్ప మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇటీవల నగరంలో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌కు పిచ్ సరిగా లేదనే వార్తలు వచ్చారుు. ఒక దశలో వైజాగ్ వన్డేను తరలిస్తారని కూడా వినిపించింది. అన్ని ప్రతికూలతలను అధిగమించి ఏసీఏ మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైంది. 260 పైచిలుకు పరుగులు వచ్చేలా పిచ్ ఉంటుందని క్యురేటర్ అంటున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా