ఇక లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ..

11 Mar, 2015 18:48 IST|Sakshi
ఇక లక్ష్మణ్ క్రికెట్ అకాడమీ..

మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్లో హైదరాబాదీ, భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సందడి చేశారు. అజీజ్నగర్ కు బుధవారం విచ్చేసిన సొగసరి బ్యాట్స్మన్ లక్ష్మణ్ 50 ఎకరాల స్థలంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. శ్రీనిధి స్కూల్ క్యాంపస్లో అకాడమీని ప్రారంభించి, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేసవిలో క్రికెట్ కోసం సమ్మర్ క్యాంప్ కూడా ఆయన ఏర్పాటు చేయనున్నారు.

మణికట్టు ఆటగాడిగా పేరున్న వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్మన్ తమ ప్రాంతానికి రావడంతో అజీజ్నగర్ వాసులు, క్రికెట్ ఫ్యాన్స్ ఆయనను చూడటానికి శ్రీనిధి క్యాంపస్ కు తరలివచ్చారు. అభిమానులను పలకరించి, క్రికెట్ పై ప్రేమ పెంచుకుంటే ఆటలో రాణించడం సులభమవుతుందని ఈ సందర్భంగా లక్ష్మణ్ అన్నారు. ఆయన పదేళ్లకు పైగా భారత జట్టుకు విశేషసేవలందించారు. వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెప్పగానే 2001లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కోల్కతా టెస్ట్ లో ఆయన చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఇప్పటికీ మనకు గుర్తుకువస్తుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు